పుట:సత్యశోధన.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

తుపాను చిహ్నాలు

ధైర్యం వహించి ఓడలో అటుయిటు తిరుగుతూ యాత్రీకులను ఓదారుస్తూ వున్నాను. ఈ స్నేహబంధం నాకు ఎంతో ఉపయోగ పడిందని చెప్పగలను.

ఓడ డిసెంబరు పద్దెనిమిదో తేదీనో, లేక పందొమ్మిదవ తేదీనో డర్బను రేవులో లంగరు వేసింది. నాదరీ ఓడకూడా ఆరోజే చేరుకున్నది. కాని నిజమైన తుపాను యిక ముందు రాబోతున్నదని అప్పటికి నాకు తెలియదు. 

2. తుపాను

డిసెంబరు పద్దెనిమిదవ తేదీనాడు టోయిటోలో రెండు ఓడలు లంగరు వేశాయి. దక్షిణ ఆఫ్రికా రేవుల్లో డాక్టరు వచ్చి ప్రతి యాత్రికుణ్ణి జాగ్రత్తగా పరీక్ష చేస్తాడు. దారిలో ఎవరికైనా అంటురోగం పట్టుకుంటే వాళ్ళను ఓడ యొక్క క్వారంటీనులో ఉంచుతారు. మేము బొంబాయి నుండి బయలుదేరినప్పుడు అక్కడ ప్లేగు వ్యాధి వున్నది. అందువల్ల మాకు క్వారంటీను బాధ తప్పదని కొంచెం భయపడ్డాము. రేవులో లంగరు వేశాక ప్రప్రథమంగా ఓడ మీద పచ్చ జెండా ఎగురవేస్తారు. డాక్టరు పరీక్షించి చీటీ యిచ్చేదాక పచ్చజెండా ఎగురుతూ వుంటుంది. పచ్చ జండాను దింపి వేసిన తరువాతనే బయటివాళ్ళను ఓడ మీదికి రానిస్తారు. ఆ నియమం ప్రకారం మా ఓడమీద కూడా పచ్చజండా ఎగరవేశారు. డాక్టరు వచ్చి అయిదు రోజులు క్వారంటీను అని ఆదేశించాడు. ప్లేగుక్రిములు ఇరవైమూడు దినాలు జీవించి వుంటాయని వారి ఉద్దేశ్యం. మేము బొంబాయి నుండి బయలు దేరి పద్దెనిమిది రోజులు గడిచాయి. కనుక యింకా అయిదు రోజులు ఓడ మీద వుంటే ఇరవై మూడు రోజులు పూర్తి అవుతాయని వాళ్ల అభిప్రాయం.

కానీ మమ్మల్ని క్వారంటీనులో వుంచటానికి మరోకారణం కూడా వున్నది. డర్బనులోని తెల్లవాళ్ళు మమ్మల్ని తిరిగి ఇండియాకు పంపివేసేందుకై పాతాళహోమం ప్రారంభించారు. ఈ ఆదేశానికి అదికూడా ఒక కారణం.

దాదా అబ్దుల్లా కంపెనీ వారు పట్టణంలో జరుగుతున్న వ్యవహారాలను గురించి ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూవున్నారు. తెల్లవాళ్ళు ఒకనాటి కంటే మరొకనాడు పెద్ద పెద్ద సభలు జరుపుతూ జనాన్ని రెచ్చగొడుతూ వున్నారని తెలిసింది. అబ్దుల్లా గారిని ఒకవంక భయపెడుతూ, మరోవంక లాలిస్తూ వున్నారట. ఈ రెండు ఓడల్ని తిరిగి ఇండియాకు పంపివేస్తే నష్టమంతా చెల్లించివేస్తామని కూడా చెప్పారట. దాదా అబ్దుల్లా యిట్టి బెదిరింపులకు బెదిరే రకం కాదు. అప్పుడు భాగస్వాములైన సేఠ్