పుట:సత్యశోధన.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ఆత్మకథ
109
 

మతాన్ని గురించి చదవాలని అనుకుంటున్నాను. యథాశక్తి యితర మతాలను కూడా పఠిస్తాను.”

దాపరికం లేని నా మాటలు విని బేకరు చాలా సంతోషించాడు. “దక్షిణ - ఆఫ్రికాయందలి జనరల్ మిషనుకు నేనొక డైరెక్టరును. నేను స్వయంగా ఒక చర్చి కట్టించాను. అక్కడ నియమిత సమయాన మత విషయాలను గురించి ప్రస్తావిస్తూ వుంటాను. నాకు రంగు తెగులు లేదు. నాతోబాటు యింకా మత ప్రచారకులు వున్నారు. మేము ప్రతిరోజు ఒంటిగంటకు అక్కడ చేరి శాంతి మరియు జ్ఞానోదయం కోసం ప్రార్థన చేస్తూ వుంటాము. మీరు అక్కడికి వస్తే సంతోషిస్తాను. మా వారందరకీ మిమ్ము పరిచయం చేస్తాను. వాళ్లు మీ పరిచయం పొంది సంతోషిస్తారు. మీకు చదవడం కోసం కొన్ని పుస్తకాలు యిస్తాను. క్రైస్తవ మత గ్రంధాలలో కెల్లా గొప్పది బైబిలే, దాన్ని చదవమని సిఫారసు చేస్తున్నాను.” అని అన్నాడు.

బేకరు గారికి ధన్యవాధాలు చెప్పి ఒంటి గంట ప్రార్ధనకు తప్పక వస్తానని చెప్పాను. “అయితే రేపు మీకోసం యిక్కడనే వేచి వుంటాను. యిక్కడి నుండి మనిద్దరం ప్రార్ధనా మందిరానికి కలిసే వెళదాం.” అని అన్నాడు. నేను సెలవు తీసుకున్నాను.

ఆలోచించేందుకు యిప్పటి దాకా నాకు అవకాశం చిక్కలేదు. జాన్‌స్టన్ గారి దగ్గరకు వెళ్లాను. వారికి డబ్బు చెల్లించి క్రొత్త యింటికి వెళ్లాను. అక్కడే భోజనం చేశాను. ఆమె మంచి యిల్లాలు. ఆమె నాకోసం శాకాహారం సిద్ధం చేసింది. వారి కుటుంబంతో కలిసి పోవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు.

తరువాత నేను అక్కడి నుండి అబ్దుల్లా గారి స్నేహితుణ్ణి చూచేందుకు వెళ్లాను. అబ్దుల్లా వారికి చీటీ వ్రాసి యిచ్చాడు. నేను వెళ్లి ఆ చీటీ యిచ్చాను. మాకు పరిచయం అయింది. ఆయన అక్కడ హిందూ దేశస్థులు పడుతున్న కష్టాలు చెప్పారు. తన యింట్లో వుండమని ఆయన నన్ను బలవంతం చేశారు. నేను ధన్యవాదాలు చెప్పి యిదివరకే బస ఏర్పాటు చేసుకున్నానని మనవి చేశాను. “మీకేమి కావాలన్నా అడగండి. సంకోచించకండి” అని ఆయన మరీ మరీ చెప్పారు.

సంధ్యాసమయం దాటింది. యింటికి చేరి భోజనం చేశాను. విశ్రమించి దీర్ఘాలోచనలో మునిగిపోయాను. ప్రస్తుతం చేయడానికి పనేమీ లేదు. ఈ విషయం అబ్దుల్లా గారికి తెలియజేశాను. బేకరుగారు నాతో యింత స్నేహం చేయడానికి కారణం ఏమిటి? వారి సహచరుల పరిచయం వల్ల ఒనగూడేదేమిటి? క్రైస్తవ మతాన్ని గురించి ఎంతని చదవగలను? హిందూమతానికి సంబంధించిన గ్రంధాలు ఎక్కడ