పుట:సత్యశోధన.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

ప్రిటోరియాలో మొదటి రోజు

అందరి సరసన కూర్చొని భోజనం చేయండి. హోటల్లో మీరెన్నాళ్లున్నా ఎవ్వరికీ ఏమీ యిబ్బంది లేదు.” అని అన్నాడు. ఆయనకు మళ్లీ ధన్యవాదాలు చెప్పి భోజనశాలకు వెళ్లి తృప్తిగా కడుపు నిండా భోజనం చేశాను.

మరునాడు ప్రొద్దునే వెళ్లి వకీలు శ్రీ బేరుగారిని దర్శించాను. అబ్దుల్లా సేఠ్ ఆయనను గురించి అదివరకు కొద్దిగా చెప్పాడు. అందువల్ల ఆయన నాకు చేసిన ఆదరణ చూచి నేను ఆశ్చర్యపడలేదు. ఎన్నో కుశల ప్రశ్నలు వేశారు. అమితంగా ఆదరించారు. నా సంగతంతా ఆయనకు సవివరంగా చెప్పాను. అంతా విని ఆయన “బారిస్టరుగా మీరు చేయవలసింది యిక్కడ ఏమీలేదు. లోగడనే మేము మంచి వకీళ్లను నియమించి వుంచాము. యీ దావా చాలా కాలాన్నుంచి నడుస్తున్నది. యిది చిక్కుల మారి దావా. అందువల్ల అవసరమైనచోట్ల మీ సాయం తీసుకొంటాను. మా క్లయింటుకు మాకు ఉత్తర ప్రత్యుత్తరాలలో జరుగుతున్న కష్టాలు మీరు తొలగించవచ్చు. వారి దగ్గరనుండి రావలసిన వివరాలు నేను మీనుండి పొందుతాను. యిది చాలా ప్రయోజనకరమైన విషయం. మీ బసను గురించి యింతవరకు నేను అడగలేదు. పరిచయం అయిన తరువాత అడుగుదామని అనుకున్నాను. యిక్కడ వర్ణ వైషమ్యం విపరీతంగా వుంది. అందువల్ల మీ బోటి వారికి తేలికగా బస దొరకదు. అయితే నేనొక పేదరాలిని ఎరుగుదును. ఆమె రొట్టెలు అమ్ముకొని జీవించు యిల్లాలు. ఆమె మీకు అవకాశం కల్పిస్తుంది. కొద్దిగా డబ్బు తీసుకుంటుంది. అక్కడికి పోదాం. దయచేయండి” అని అంటూ లేచి నిలబడ్డాడు.

ఇద్దరం ఆమె ఇంటికి వెళ్లాం, ఆమెతో చాటుగా ఏదో మాట్లాడాడు. వారానికి 35 షిల్లింగులు తీసుకొని భోజనం పెట్టడానికి ఆమె అంగీకరించింది.

బేకరు మంచి వకీలే గాక మతబోధకుడు కూడా. ఆయన యిప్పటికీ జీవించే యున్నాడు. ఆయన పని యిప్పుడు మత ప్రచారం చేయడమే. వకీలు వృత్తి మానివేశాడు. సిరిసంపదలు బాగా వున్నాయి. యిప్పటికీ మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ వున్నాయి. ఆయన విశ్వాసం, వాదన ఒకటే. క్రైస్తవ మతమే ప్రశస్తమైనది. జీససు ఈశ్వరుని ఏకైక పుత్రుడు. మనుష్యుల్ని తరింపచేసే తారకుడు. యిట్ట విశ్వాసం వల్ల పరమ ప్రశాంతి లభిస్తుంది. యిదే ఆయన బోధకు సారం.

ప్రథమ దర్శనమప్పుడే ఆయనకు తత్వబోధన గురించిన నా భావాలు చెప్పివేశాను. నేను చెప్పిన దానికి సారం - “నేను పుట్టుకచే హిందువును. అయినా నాకు హిందూ మతమంటే ఎక్కువగా తెలియదు. ఇతర మతాలను గురించి అసలే తెలియదు. నిజానికి నా స్థితి ఏమిటో నాకు తెలియడు. ఎలా వుండాలో కూడా తెలియదు. మా