పుట:సత్యశోధన.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

దక్షిణ ఆఫ్రికాకు ప్రయాణం


5. దక్షిణ ఆఫ్రికాకు ప్రయాణం

నేను ఆ అధికారి దగ్గరికి వెళ్ళడం పూర్తిగా తప్పు. అయితే అతడి తొందరపాటు, అతి ఔద్ధత్యం ముందు నా తప్పు చిన్నదైపోయింది. నన్ను గెంటించనవసరం లేదు. అతని సమయాన్ని అయిదు నిమిషాల కంటే నేను వ్యర్థం చేయలేదు. అతడు నా మాటలు వినడానికే సిద్ధం కాలేదు. నన్ను మంచిగా వెళ్లమని చెప్పవచ్చు. కాని అతనికి అధికార దర్పం పెచ్చు పెరిగిపోయింది. అసలు సహనం తక్కువ అని కూడా ఆ తరువాత తెలిసింది వచ్చిన వాళ్లనందరినీ తృణీకరించి పంపుతూ వుంటాడని. కొంచెం కష్టం తోస్తే మండిపడుతూ వుంటాడని తెలిసింది.

అయితే నా పని అంతా అతగాడి ముందే అతడిని త్రోవకు తేవడం కష్టం ఆశ్రయించడం నాకు యిష్టం లేదు. మాననష్టం దావా వేస్తానని వ్రాసి ఆ తరువాత వూరుకోవడం నాకు యిష్టం లేదు.

ఈ సమయంలో మా రాష్ట్రమందలి చిన్న చిన్న రాజకీయాలు నాకు తెలిశాయి. కాఠియావాడు చిన్న చిన్న రాజ్యాల కూటమి. అందువల్ల రాజకీయవేత్తలు అక్కడ అధికం. సంస్థానానికి సంస్థానానికి పడదు. అనేక కుట్రలు, పలుకుబడి కోసం ఉద్యోగుల్లో ఉద్యోగులికి మధ్య కుట్రలు. సంస్థానాధిపతులు సులభులు. వాళ్లు దొరగారి నౌకర్లకు కూడా సులభులే. ఇక శిరస్తాదారు. ఆయన దొరగారికంటే ఎక్కువ. శిరస్తాదారే దొరగారికి కన్ను, చెవి. అతడే దొరగారికి దుబాసి. అందువల్ల శిరస్తాదారు మాటే మాట. అతడి రాబడి దొరగారి రాబడికంటే అధికం. అతడికి వచ్చే జీతం కంటే అతడికి అయ్యే ఖర్చు చాలా అధికం. యిందు అతిశయోక్తి ఏ మాత్రమూ లేదు.

ఈ దేశమంతా విషవాయుమయం అని అనిపించింది. విషవాయువు తగలకుండా స్వాతంత్ర్యాన్ని రక్షించుకుంటూ ఉండటం ఎలా అనే దిగులు నన్ను పట్టుకుంది.

నాకు ఉత్సాహం తగ్గిపోయింది. యీ విషయం మా అన్నగారు గ్రహించారు. ఎక్కడైనా ఉద్యోగం దొరికితే కుట్ర నుండి బయట పడవచ్చునని తోచింది. కుట్ర చేయకపోతే మంత్రి పదవిగాని, జడ్జి పదవిగాని లభించదు. పైగా ఆ దొరకు నాకు ఏర్పడ్డ వైమనస్యం మా యిద్దరి మధ్య పెద్ద అగాధం సృష్టించింది. అప్పుడు పోరుబందరు సంస్థానం తెల్లవారి ప్రభుత్వాధికారానికి లోబడి వుంది. ఆ సంస్థానాధిపతికి