పుట:సత్ప్రవర్తనము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

80

సత్ప్రవర్తనము.


సత్ప్రవక నము ఈ నాలుగు మార్గముల నెవ్వఁడు చక్కగా సంభావించునో ఏఁడే వృద్దికి గాఁగలడు. నేడు సాధుసంగతి గూర్చి యొక్క... యితిహాసమును దెలుపుదు. వినుండు. సాధు సంగతి. మున్నొక్క రాజు రాజ్యమును బాలించుచుండెను. ఆతని కొక్కముని మీతుడుగా నుండెను. ఏవిషయమున సందియము లుండిన నాముని నడిగి తెలిసికొని యరీతిఁ బ్రప ర్తించువాడు. ప్రజ లాతనియందు ననురాగముగలిగి పవ గ్గించునారు. కొంతకాల మిట్లు సాగఁగా నొకళుమారు డారాజునకుఁ గలిగెను. సంస్కారములన్నియు యథావిధిగా పొగించెను, విద్యయుఁ దగినవారి నియమించి చెప్పించెను. యుక్తవయస్సు వచ్చునప్పటికీ యువ రాజం నొనరింపఁదగు యోగ్యతయుఁ గలిగేను. ఎల్లరు సంతసించిరి. ఆమహోత్స వము సాగింప నెల్లరు నుద్యుక్తులై యుండిరి. దైవగతి విపరీత ముగా నున్నపుడు మానవ ప్రయత్నము నిష్ఫలమగునన్న సూక్తి యెల్లరకు బోధించుటకో యన నా రాజవరేణ్యుఁడు మృతినొందెను. 'రాజ్యమంతయు దుఃఖమయమయ్యెను, ప్రజలెల్లరు చక్కంగా నాలో చించి కుమారుని బట్ట భద్రు నొనరించిరి. పితృసఖుఁడగు మునియు నగు దెంచెను. మంత్రి ప్రభృతుల కముని పై నీష్య యుండెను. రాజు సమర్దు డగుటయు, ముని సర్వజ్ఞుడగుటయు మునిమతము ననుసరించి రాజు 'మెలంగుటయుఁ గారణములుగా వారి దుర్వాంఛలు ఫలింపక యుండెను. రాజుపత్ని సాధుస్వభావభూషిత యగుటం గుమారునిం 'బిలిచి . 'నాయనా! ... మునీవదునానతి మెయు