పుట:సత్ప్రవర్తనము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

66

సత్ప్రవర్తనము.


కలవారికి శాస్త్రము లన్నియు జపివిన పెట్టి విజ్ఞాన ముడ యించునో దానిని మించిన జ్ఞానముండునని మీరెజుంగ వలయు. ఈవనమున మిము బాధించెడి జంతువు లేకుయు లేవు. మీరు వేతొక్క దానిని గని యది కూపస్వభావము గలదని భావింతుని యది మీము నట్లే భావించి తనకధానము కలుగఁగలదన్న బుద్ధిచే నది కలుగకుండ జేసికొనుటకై మీము బాధించును. అట్లుగాక మీరు దానం గాంచి సద్భావముగల పొగుదు రేని యదియు సద్భానముకలదియై మి:ముం బ్రేమిం చును. పరస్పర సుహృద్భానమే సుఖ హేతువగును. పకస్పర జిఘాంసయే దుఃఖ హేతు వగును. ఈ విషయమును జక్కఁగా భావింపుఁడు. ఇట్టి న నేక విషయములను మీ రిందుఁ గనుఁ గొందురు. నాయి" వాక్కులను దలపోయుచుఁ దిరుగుఁడు. మధ్యాహ్నము పిదప నాతో మాటలాడుచుండుఁడు, ఇదియే మీరిందుఁ జేయఁదగునవి. శ్లో. 'యాతి న్యాయ ప్రవృత్తస్య శిర్మంచోడిపి సహాయతాం, అపంథానం తు గచ్ఛంకం సోదర్కోనీ ఏముంచతి.' (న్యాయము ననుసరించి ప్రసంచువారికిఁ బడులును సాయ పడును. అన్యాయకథమునఁ దిరుగు వారిని సోదరుఁడు కూడ . వదలి పెట్టును) అన విందుకు కదా! ఈనీతినే పలుమాఱులు సంస్మరింపుఁడు. ఎట్లు ప్రవర్తింపవలయునో స్పష్టమగును. సాయంసమయ మిది. అనుష్టానమునకుం బోయెదను. మీరును రండు, అనుష్టానానంతరము మీముల మాటలాడింతును. అంతచసుక మాసముగ నుండుఁడు. మానము సరా - సాధకము. ప్రతిమానశ్రుఁడు నొక్కింత సేపు మౌనముగ నుండ నభ్యసించు నేని, యాయుస్సును గొంత వృద్ధి చేసికొన్న వారం