పుట:సత్ప్రవర్తనము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

సత్ప్రవర్తనము.

 కుమారులు కోలది దినము లిందుందురుగాక, వారి విషయమై 'యేవిచారమును బెట్టుకొనక మీ కరుగులడు. నేను వారిని జూచుకొను చుందును, ధర్మోపదేశము చేయనెంచితిని " అనం గానే వారి యానందమునకు 'మేరలేదయ్యెను. భోజనానంత రము పనివినియెద మనిరి, దాసు నవ్వుచుఁ బిండివంటలు చేసి యిచ్చి పోవునంత యవసరము లేదనియెను. సుశీలకు రామ చంద్ర రాజునకు నచ్చెరువు తోఁచెను. అతీంద్రియ జ్ఞాననిధి యన్న భావము వారికి దృడపడియెను. వారొండొరుల 'మొగ ములు చూచుకొన సాగిరి. మరల శిశువుల రక్షించు భార మావర మేశ్వరునివిగానీ మనది గాదని నమ్మి పొండని దాసుగారనిరి. చిత్తమని బదులు పలికి సెలనంది యెల్లరుఁ దమనివాసముల కరిగిరి. మధుసూదనరాజూమాటల యర్లమెఱుంగక ప్రస్తావింపఁగా రామచంద్ర రాజు తన భార్య ప్రయత్నించిన విషయ మెఱిరిగిరని యిది మాకుదప్ప నెవరికిఁ దెలియదనుకొంటిమి. దివ్యదృష్టిగల దాసుగారెఱింగిని తెల్ప నాతండచ్చెరువంది సాయం కాలమునకు ముందే ఫలాహారము చేసి దాసుగారు కూరుచున్నతంబోయి కుమారుల నప్పగించి యా రెండు కుటుంబముల వారును గనకవల్లికిం బోయిరీ.

దాసు సీతారాము సూర్యనారాయణవర్మలం . జూచి, “కుమారులారా! మీరియ్యాశ్రమమున నుండుఁడు. వృక్ష మూలముల నుండకుఁడు. మధ్యాహ్నము దాఁటంగా సాయంకాలము దనుక నేను మీతో మాటలాడుదు. రాత్రినేనిందే శయనింతును. మీరు నా చెంత శయనిపు:డు. దుష్టమృగసర్ప బాధ లిందుఁ గలుగవు, సాయంసమయముననే నల్లకుండినకు స్నానార్దము వెళ్లుదును. నాతోడ రండు, మీకాకలి కాక