పుట:సత్ప్రవర్తనము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

59


ముల నొసంగినాడు. ఋణముల: దీర్చెదను. పాఠశాలలోకి బంధువర్గములో నీపేరు సంతోషము నొదవించునట్లు వర్తింపు '. ' మని యనేక భంగుల బోధించి పొద్దుపోయిు సందున గోడుకును శయనింపుమని పంపెను. రామరాజుం జూచి పుత్రభిక్షము పెట్టిన మహాత్ముడవు.. నీయుపకారమునకుఁ బ్రత్యుపకారము చేయుఁజూలను. నావలన శ్రమం బయ్యెను. మన్నింపు" మని వేడుకొనతండును దగినట్లు మాటలాడి యాతని యనుమతినం శయనించెను. ఎల్లరు శయనించిరి. మటునాఁటియుదయమున వారు పయనము చేయఁగా ఫలాహార పూర్వకముగా సాగనంపిరి. వెంటవచ్చిన బాలురకు: బసదనంబిచ్చి పంపెను.

నాల్గవ ప్రకరణము.

రామచంద్రరాజు సుంత యవకాశము దొరకినపుడెల్ల భగీరథ దాసుగారిని దర్శించుచుండువాడు, మధుసూదన రాజు దర్శించివచ్చిన మఱుదినమే వారి దర్శింపబోయి యుండెను. దాసు ఈ రాజును జూచినఁ బరమానందభరితుఁ డగుచుండు "వాడు. మాటలాడునంత సేపు సత్పుత్త, భాగ్యము నీకు లభించెనని పలుకుచుండుట యా యోగి కలవాటు. ఆన్నాడు. రాజుతో మాటలాడుచు నేను గోరినపుడు నీతనయుని నాకడనుండునట్లు చేయఁగలవా?” అని ప్రశ్నించెను. పట్టరాని