పుట:సత్ప్రవర్తనము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

సత్ప్రవర్తనము.

కనకవల్లి : జేరఁగనే సూర్యనారాయణ పూర్వరీతిగానింట బ్రవేశించి తండ్రికి నమస్కరించెను. అంతియగాక పొదములను గరములం బట్టుకొని విడువక యించుక సేపుండెను, ఎల్లరూరకన చూచుచుండిరి, కన్నీటి ధారలచే గాళ్లు దడియు చున్నట్లు తెలిసికొని మధుసూదనరాజు దయానశికృతహృదయుఁడు గావున జూలి తన్ను ఁ బురికొల్పం గొడుకు లేవనెత్తి చూచునంతలో నాతని హృదయము జలధారలఁ దోగు చుండెను. దానుజూచిన వారలకే మనస్సు కరగెసన నిక దండ్రి, మూటయిట జెప్ప నేటికి కొడుకునకంటెఁ దండ్రియుఁ దండ్రికంటే గొడుకు నేడువసాగిరి వీరిరువురను మించి తల్లి విలాము. వానీని మించి వచ్చిన వారి రోదనము చెలరేగ నాగృహము దుఃఖమయ మయ్యెను. కొలఁది నిమేషములకుఁ దండ్రియు కుమారుఁడు వచ్చిన వారును దల్లియు గ్రమముగా "నేడ్పుడిగిరి. మధుసూదన రాజు కొడుకుఁ జెంతఁ గూరుచుండఁ బెట్టుకొని “నాయనా! పగవకుము, గ్రహచార బలమున నీకిట్టి యపకీర్తి చేకూరినది. ఇంక నైన సత్సహవాసమున మంచి పేరు సంపాదింపుము నన్నును చల్లి నపకీర్తినొందఁ జేయకుము. నలుగురు బంధువులలోఁ దలయెత్తుకొని తిరుగఁ జేసి 'పెద్దల పేరునకు హాని నావలన రాకయుండంబు వర్తింపుము, నీవుద్దరింతువని కొండంత యాపతో నున్నాము. మానోముల పంటగా నీవు జన్మించితివి. ఇంతదనుక మాకు మసశ్చింత కలిగినదే లేదు. రెండుమూడు దినములనుండి యించుకించుకగా నది యంకురించి నేటి యుదయమునుండి వర్దిల్లీనది. జరగిన దానిని స్మరింపవలదు, ద్రవ్యవ్యయమునకుఁ జింతింపకుము. ఋణములకు భయంపడకుము. భగవంతుఁ డించుక యన్న వస్త్ర .