పుట:సత్ప్రవర్తనము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

57


గొలంది నెలలలో శ్రీ రామకృష్ణ పరమహంస యాస్తిక శిరో మణినిగా నొనరింపజాలెను. . గురువు చిత్తము పరమపావనము, కరుణారససాంద్రము. కావున బ్రేమరశ్ముల శిష్యుని బంధించి తత్చిత్తకల్మషమును సద్బ్కోథామృత ధారల గడిగి వినిర్మలముగా నొనర్చెను. విగతకల్మషం యాతడు జ్ఞానవంతుఁ డయ్యెను. కావున బోధకులు తమకు పరిశుద్దాంతః కరణులై భోధ్యులను బారిశుద్దత్మకులం జేయఁ జూలుదురు. కేవల వాగాడంబరమున ఫలము లభించనుట స్పస్టము ఇఁకఁ గడకు మరలుదము.

ఇందిరాంబ హస్తస్పర్శముననే కుచూపుండె సూర్య నారాయణుడు. సుమతి యయ్యెను. శకటాంర్భాగమున నాపూజ్యమతి యేమి బోధించెనో యెవ్వ్రరెంరుంగరు. విశ్లేషించి బోధించునంత యవ కాశమామెకు నుండదనియు నామె సద్భావనమే యాతని మరలించే ననియు మన మూహింప వచ్చును. ఇన్ని దినము లేల యామె సద్భావము మరలింపు జాలకపోయెనని యడుగవచ్చును. ఇంతకుముం దామెకు దనయుని దుర్నీతి తెలియదనియు నిన్నమొన్ననే యామె చెవుల నంటి సోఁకెననియు నాయమ తనసద్భాన మాసమయ ముసల గసంబఱ చెననియు మనమూహింపవచ్చును. దీనికే మనశ్శక్తి యనియు నిశ్చయింపవచ్చును. మనశ్శక్తి లేక యేపనియు సొగదని భగవంతుఁడు గీతాశాస్త్రము సందుఁ దెలిపి యున్నాఁడు. చంచలమగు మనస్సును గ్రమ క్రమముగా స్వాధీనము చేసికొనినచో నది లోకాత్రయమును స్వాధీనమున నుంచఁగలదు. యోగశక్తియన్న నదియే..