పుట:సత్ప్రవర్తనము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

సత్ప్రవర్తనము.


ఆయోగ్యః పురుషో నాస్తి యోజక స్తత్ర దుళ్లుభక. ” 

అన్న సూక్తి యేనాఁడును వ్యర్థము కాదు కదా!

పాఠకమహాశయులారా! లోకమున మంత్రముగాని యక్షరమొక్కటీయు లేదు. మందునకుఁ బనికి రాని మూలము (వేఱు) "లేదు, కుజనుఁడనఁబడు వాడును లేడు. కూర్పు వాఁ డొకఁడే దొరకడు అనఁగా భావమేమి? ఏయేయ క్షరములు కలిపిన మంత్ర మగునో, యేయే వేఱును గూర్చిన మందగునో ఎబ్లెట్లు సంస్కరించిన బాలుఁడు బుద్ధిమంతుఁడగునో యరింగి సంస్కరించు వాఁడొక్కఁడుండిన జాలును. ఈశుక్ర నీతి. 'వాక్యము సూహింపుఁడు. బాలు రెల్లరు తొలుత నవివేకులుగనే యుందురు. చక్కని సంస్కారముల చేత నెల్లరు బుద్ది మంతులగుదురు. ఈనియమ మేకాలమునసు వ్యర్థము కాదు. ఇపుడు దుష్ప్రవర్తకులగు బాలురుండుట సంస్కర్తలు "లేక యే గాని వేఱు కాదు ఎంతటి దుష్ టబాలుడైనను జక్కనిసంస్కర్త యొదవెనేని బాగుపడునని శుక్రనీతి 'తెలుపుచున్నది. ఎంత ప్రయత్నించినను జక్కని పవర్తనము లభింపనివాఁడొకా నొకండుండ వచ్చును. సామాన్యశాస్త్రమున కొకానొక చోటఁ బ్రవృత్తి లేక పోవచ్చును. కానీ సాధారణముగా నది వ్యర్థము కాదనవచ్చును. సంస్కర్త పరిశుద్ధచిత్తుఁ డయ్యెనేని శిష్యునిబుద్ధిని మరల్పఁజాలుననుట సిద్ధాంతము. శ్రీ రామ కృష్ణ పరమహంసయుల దచ్ఛిష్యుఁడగు 'వివేకానంద స్వామియు నిందుల కుదాహరణము. తొలుత వివేకానంద స్వామి యేస్థితి యం దుండెనో పరమహంస యాతని ,నెట్లు మార్చెనో యల్లరకుఁ దెలిసినవిషయము, నా స్థికుడుగా నున్న యావిదారిని