పుట:సత్ప్రవర్తనము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

55


నాదెబ్బ, మిమ్మేమి చేసెదనో యనమాట లాతని నోటినుండి వెడలుచుండెను. మఱి నాలుగు నిముసములకు మఱికొందఱ బట్టుకొని వచ్చి రాము రాజు మ్రోల నిలిపిరి. వారే యాదుష్ట బాలుని మిత్రులని పాఠకులూహింపఁగలరు, వారం జూడఁగనే రామ రాజు పట్టరాని కోపమున "నేమో యనఁబోయి సమయము కాదని యాగ్రహమాపుకొని "లేనిశాంతము సభినయించుచు 'నెడ నవ్వు కనంబడంజేయుచుల దడబడుమాటలతో “నాయనా! మితల్లిగారు వచ్చి యున్నారు. తండ్రిగారికి మనో వైకల్యము గలిగెనఁట, సంస్థానము చాల చిక్కులలో బడినదఁట, ఋణములిమ్మని యు త్తమర్ణులు (creditors) అడుగు చున్నారంట. మీతల్లి గారు విచార సాగరమున మునింగి దిక్కు దోసమి వచ్చియున్నారు. ఇల్లు వెడలి యాతల్లి నీకై వచ్చినది. 'నాయనా! తల్లిదండ్రుల దుఃఖముల పాలు చేయుట న్యాయమా?” అనుసంతలో నొకశకటము నడుమ నుండి “సూర్య నారాయణా నాయనా! రారా యసుమాటలు వినవచ్చెను, తల్లి యేయని ధ్వనినలన నెఱింగి గబగబ పరుగెత్తెను. బండి నుండి చేయిపట్టుకొన్న జూడ కనఁబడెను. నలుపురను గావలి యుండఁ బంచి రామరాజు తాను నాబండి వెంటఁ బోయెను, ఆశకటనలు కనకపల్లి కేసి పోనపొగెను. రాత్రి మూడవజాము గడువకముందే కనకపల్లి జెల్లరును జేరఁగల్లిరి. అంతలో నాయిందిరాంబ యేమి భోధించెనో తెలియదు కాని సూర్య నారాయణవర్మ మనస్సు మాపోయెను. తనయపరాధముల నంగీక రించి క్షమింపుఁడని కోరఁదగు స్థితియందుండెను.

"ఆమంత్ర ముక్షరం 'నాస్తి, నొ నీ మూలమసౌషధమ్,