పుట:సత్ప్రవర్తనము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

సత్ప్రవర్తనము.


నిడుదవోలు రామరాజు కొందఱు బాలురసు బిలుచు గోని యందందు వెదకుచుండెను. సుమారు పదునొకండు గంటల వేళ యయ్యెను. దుర్వృత్తు లెల్లరు గ్రామ రాజు వెంట నుండిరి. ఆయాయి గృహములంజూచుచుఁ బోవుచుండి ఒక్క దుండగీడు వచ్చి మాయింటిలో నున్న వారిని సంజ్ఞ చేసెను. అది యొక చిన్న వీథి, అందుండు వారు ప్రాయికముగా వేశ్యలు. వారివంటివారు మఱికొందఱు నంచుందురు. సాధారణముగా బెద్దమనుష్యులు మంచి బాలురు నాసందు వీటికిం బోవరు. ఎవరైనఁ బోవుచుండఁగాఁ జూచిన 'వారు నవ్యుదురు. కొత్త వారెనరనఁ బోవుచున్న ట్లగపడిన బతిమాలి యది పోదగిన వీథి కాదందురు, ఆ వీధియండే యొక వేళ్యాగృహమున సూర్యనారాయణ రాజు నతని మిత్రులు నాలో చించుచుగిడిరి. ఆగృహము చూడగనే రామరా జేపగించుచు వీధి లేక యా ఇంటి ముందు నిలువంబడి యందుం జోరందగినవారల బతిమాలుచు! 'పెడత్రోవను బాఱిపోవక యుండఁజూచుచుండ మఱి కొందఱు నియమించి వారి సుబ్బించుచు బతిమాలుచు నుండెను. నాలుగువైపులం గొందఱు కనిపెట్టియుండిరి. ఒక రిద్దఱు పిలువందగినయట్టు లాయింటి వారిని పిలిచిరి. వారెఱింగిన పొరి కంఠధ్వనియే కావున వచ్చి తలుపు తెఱచిరి, లోనికింబోయిరి. ఒక యీల వినవచ్చెను. ఎల్లరుపరు గెత్తిరి. ఏమిదియని రామరాజు విభ్రాంతుఁడై చూచుచుండ గోడ దాటిపోవుచున్న సూర్యనారాయణవర్మను బట్టి తెచ్చితి మని బాలు రాతని నప్పగించిరి. ఆతని 'మోమున గ్రోధము సాట్యమాడుచుండెను. బరిమళములు 'వెదజల్లుచు దుస్తులు సొగసుగ నుండెను. "ఏల నన్ను - దెచ్చితిరి? చూడుఁడు