పుట:సత్ప్రవర్తనము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

సత్ప్రవర్తనము.


నిన్ను బర గ్రామమునకే పంచుఁజూచుచున్నాఁడను. అనివార్య కార్యమగుట దప్పిన పిదప మనకు భరింపరాని దుఃఖము లభించుటయను నీ రెండు కార్వములం దలంచుకొని మన మించుక త్వరపడ వలసియున్నది. కుముదవల్లీ లో 'నామిత్రులు పెక్కండ్రు గలరు. నిడుదవోలు రామరాజు మనయింటికి వచ్చుచుండువాఁడు కదా, ఆతని భార్య నీయందు విశేషించిప్రీతి గౌరవములు గలదనుటయు నీ వెఱుంగుదువు కాదే? వారి యింటి కిప్పుడే పొమ్ము. అతఁడు వేదకీ యెందున్నను సూర్య నారాయణను ఫిలుచుకొని వచ్చును, నీదగ్గరకు రాఁగా నెట్లో మంచిమాటలు చెప్పి పిలుచుకొని రమ్ము, ఎంత ప్రొద్దు పోయినను రావలయును. అంతదనుక మేలుకొనియుందును. నిద్ర, పట్టు కాలమా యిది? కుపుత్రుడు పూర్వదుష్కర్త ఫలము. మన మీరువురము తొలిజన్మమున నేదుష్కరమును సమానముగా నొనరించితిమో, దానిఫలమును సమానముగా సనుభ వించుచున్నాము. ఏధీగతి దప్పించున మనకు శక్యమా? సాధ్వీ! తడవు చేయవలదు. నాభోజనవిషయము తలంచు గోనకుము. ఈవిచారమునఁ గడుపునిండియే యున్నది. ఆహా రమునకుఁ జోటు కౌనరాదు. పూర్వదుష్కృతమును సంతోషమున ననుభవింపవలయునని పెద్దలు విశ్లేషించి భగీరథ దాసు గారును జెప్పఁగా , నిన్నాఁడను గావునఁ బ్రాణేశ్వరీ! తడవు చేయక పయనము చేయు' మనఁగా నాయమయు భర్త కెదురాడ నోడి కార్యభంగిం దలంచుకొని సమ్మతించెను.

సూర్యనారాయణ రాజు పాఠళాలయందు సాగిన మహాసభ నాలకించి విద్యార్థులు తన కుతంత్రమును దెలిసి