పుట:సత్ప్రవర్తనము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

సత్ప్రవర్తనము.


నిలువంబడియెను. అతని వినయము మనస్సున కెంతయో యానందమును గల్గింప రమ్మని కూరుచుండుమని పలికి యిరు వురును గూరుచుండి కుశలప్రశ్నము కాఁగా వత్సా! నా కుమారుని వృత్తాంతమును సాంతముగా నెఱింగింపుము. ఇంచుకంతయు దాఁచి పెట్టకు మనఁగా నాబాలుడు తానేఱింగిన దంతయుఁ దెలిపెను. భార్యయు వినుచుండ దాన నించుక శ్రమము తనకుఁ దగ్గెనని యూహించుచు విని ముక్కుపై వేలిడుకొని చేయునది యేముని యోజింపసాగెను. సీతారామరాజు సెలవంది తనయింటికి బోయెను.


ఆ బాలుని యడఁకువ, మాటలపొంకము, సమ యోచితముగా మాటలాడు నేర్పు మధుసూదనరాజు మనస్సును గరగింపు జాలెను, ఒక్కొక్కటియు నుత్తముని జేయఁజాలును. అన్నియు గుదిరినఁ జెప్పవలసిన దేమను కొనుచుఁ దనకొడుకుం దలంచుకొని యతని యవినీతిం దలంచుకొని చింతాసాగర నిమగ్నుఁ డయ్యెను. సాధ్వీమణి యనందగు నిందిరాంబ "నాథా! విచారించిన లాభము లేదు, భగీరథదాసుగారినుడు లెప్పుడును వ్యర్థములు కావు గదా! మనపిల్ల వాని నెట్లో యింటికి బిలిపించుకోని బుద్ది చెప్పి కారణాంతరమున నా యోగికడకుఁ బిలుచుకొని 'పోవుదము, ఆమహనీయుని దర్శనమున నవినీతియెల్ల నశింప వినీతుఁడగును. ఊరక విచారమునకు మీమనస్సునం జోటీయ కుఁడు పెద్దలమాటలు వృథ గావు.” అని మృదుమధురోక్తుల హితముఁ గర్తవ్యమును దెలుఁగా సంతసించి "ప్రేయసీ !. అనుకూలవతియగు కళత్రము వూర్వపుణ్యమున నే లభించును.