పుట:సత్ప్రవర్తనము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

43


గాక అని పలుకంగా నెల్లరు సమ్మతించిరి. ఏ సభ ముగింప బడంగా నెల్లను తమతము యిరవుల కరిగిరి.

మూడవ ప్రకరణము.

కుముదవల్లికి దూర్పు భాగమున రెండు క్రోశముల యంతదవ్వున నొకయడవి గలదు. దానిపొడవు యోజనము, "వెడల్పు గప్యూతమాత్రమునై యుండెను. అందు గ్రామములు లేవు. అడవియను పేరు దానికేం జెల్లునా యని "పెక్కండ్రు సంశయించి యెందఱునో ప్రశ్నింతురు, కాని పెదవి విజచుటయే మందులకు సమాధానము వచ్చుచుండును, అందు విశేషించి సహాకారతరువులు (తియ్య మామిడి చెట్లు, గొబ్బెన చెట్లుండును. ఎన్ని ఫలపక్షములు లోకమునఁగలవో యన్నియు సందున్న వని వారకులు సమ్మవలయును. ఒక్కొక్క తావున నెన్ని యో పేరులుగల యరటి చెట్లుండును. అందొక్క జూతిది పొట్టిగా నుండును. దాని గెలమా త్రము దానికంటే మూరెడు పొడవు మిక్కిలిగా సుండును. కావున దాని మూలమున ద్రవ్వియుందురు. 'ఆగెల యాబొరియలోనికి దిగి యుండును, ఆగెలయందు లెక్కించిన మూడువందల పండ్లుండును. వానికి వామన కేళులని పేరు. చిటికెన వేలంత పరి మాణముగలవి కొన్ని గలవు. అవి భక్షింపఁ దనివితీఱదనుట నిక్కము. వానిని గిన్ని పండ్లుదురు. ఇట్టివెన్నియో పేరులు గలవి యందుఁ బొడసూపును. విశేషించి 'పెంచి వ్రాయ నేల?