పుట:సత్ప్రవర్తనము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

41


లేఱుంగక వానినెల్ల సమ్ముదురు, దాన వ్యర్దముగ మనకపకీర్తి కలుగును. దీనికి మూలము మన యల్పదృష్టియే కాని 'వేఱు గాదు. కుడిచి కూరుచుండి యకవాదమును భరించుట మన గ్రహచారమే యనగలము. కావున మీరెల్లరు నాలోచించి మాలో పములున్నఁ దెలిపీ మాలోపములు దెలిసికొని వానిని దొలఁగించుకొని ప్రవర్తింపుడని మాయాశయమును దెలుపు చున్న వారము. మోమోటము మాని మీమీ హృదయ భావములఁ దెలియఁ జేయుఁడు. మాకు మీయం దించుకంతయు నాగ్రహము లేదని మాత్రము మఱి యొక్క సారి తెలియఁ జేయుచున్నాము.

అని ప్రధానోపాధ్యాయులుప న్యసించి తమ పీఠమునం కూరుచుండఁగా నెల్లరు నిశ్శబ్దముగా ముహూర్తకాలముండిరి. ఆవల గుసగుస లారంభమయ్యెను. కొలఁది నిమేషముల గయ్యది విచారముగా మా ఱెను, తుదకశ్రుబిందు పతనముగా నయ్యవి చూపట్టెను. ఒక్క విద్యార్థి లేచి డగ్గుత్తికతో మహా శయులారా! యిం డెవరెవలనను దోషము కానరాదు. వ్వర్ల ముగఁ గుత్సితుల మాటలు వినినందున నీయ్యనివార్యాల యశము ప్రాప్తిం చెను. సూర్యనారాయణ రాజు పన్నిన పన్ను గడయే యిది. మేమెల్లరము దానికి దాసులమైతిమి. దీని నాలోచింపఁగా బురుష ప్రయత్నమునకంటే దైవము మహాత్తరమని స్పష్టమయ్యెడిని, జరగినదానిని మరల స్మరింపక యథాపూర్వకముగా బవర్తించుట యిపుడు చేయఁదగినపని.. నేడు విడుమర యనుకొందము మామానసములు పావనము లయ్యెను. కర్తవ్య మెట్లో గురువు లే యుపదేశింప సర్హులు.