పుట:సత్ప్రవర్తనము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

39


యెఱింగియు గురువుల యానతి మీరరాదని యీనాలుగు మాటలు చెప్పితిని. త్వరపడి మనము మేలుపొంచు మార్గము నాలోచింపనలయును.మీరంగీకరింతురని నమ్మి మీయసుమతి కలుగునని నాస్థానమునకుఁ బోవుచున్నాఁడను.


సీతాము రాజు వాక్యమొకొక్కటియు నొకయు మృతబిందువువలె విద్యార్థులకుఁ జెపుల సోఁకెను. అంతటం బ్రధానోపాధ్యాయుఁడు లేచి నిలుపుబడి యిట్లు బాలురకు నుపదేశించెను. .ప్రియ బాలకులారా! మనస్సులు నీవిషయము నందే నిలిచి యుండఁజేసి యాలకింపుడు. పాఠశాలయందుండు నంతదాక మాకు మీకు గురుశిష్య నాయుము కుదురుగ నుండ వలయు. దీనిందాటగనే సఒదర న్వాయము పాదుకోనవలయు, దీనిచే మీకు మిక్కిలి మేలు కలుగును. పూకు మీమేలే పరమలాభము. మాకడం జదుపుకొని బుద్ధిమంతులరై మీ ప్రవర్తించినఁ జూచి మేమానందింతుము .' ఇంత కంటే నెక్కడు లాభమును మేము కోరము, ఈలాభమును మీవలనఁ బొంద. గోరుదుము ఈమాత్రము లాభము మీరు మాకుఁ గలిగింపంగూడదా? దీనికే గురుశిష్య న్యాయమనియుం బేరు, మీరు కూడ మావలనఁ గఱిచిన విద్య పెంపున సర్వజన సమ్మత , ప్రకృతి గాంచిన నదియే లాభము. ఆలాభము మీకుఁ గల్లింప మేము కోరవలయును. ఇట్లుకోరమేని యిరువురము స్వధర్మము నిర్వహించిన వారము కాక యుందుము. అపుడు మన కీరు దెగలవారికిని సుఖము లేదు,

ఒక్క కుటుంబము నందుండు వారు నొక్కరి మాట చొప్పున ,బవర్తించినంగాని పని సాగదు. ఎల్లర వాంఛ లొక్క కార్యమున ఫలించకపోవచ్చును. దాన నాగృహాధిపతికి