పుట:సత్ప్రవర్తనము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

సత్ప్రవర్తనము.


ఇది పెద్దలనుండియు మీవంటి బుద్ధిమంతులగు సోదరుల నుండియు 'నేను నేర్చుకొన్న మార్గము. ప్రకృత మనుసుంచెదను. ఒక్క కార్యమునఁ బెక్కండ్రు ప్రవర్తించినచో నందు జయ మొక్క.రికే కలుగును. తక్కినవారు వాని కేల జయము కలిగెనని యసూయపడ రాదు. అట్టి దుష్కార్యమునఁ బ్రవర్తించిన లోక ప్రవృత్తియే సాగదు. ఇది యందఱకుఁ గలుగు నదియే. కావున నీ మార్గమే ప్రబలిన నొక్కరికొక్కరికి సంబంధమే లేక పోవును. అట్లు చేయక జయమందిన వారిని మనము ప్రేమించిన నింకొక్కసారి వీరినతడు ప్రేమించును. దానిచేఁ బనస్పర స్నేహము వర్ధిల్లును. స్నేహలతను అసూయా లవి త్రముచేఁ ద్రెంచివేయుఁ బూన రాదు. దాననేనాఁటికి మేలు చేకూరదు.

మన విషయమున నిట్టీ యసూయాపనర్తన మీపుడు సాగుచున్నది అని నవ్వు పుట్టించుచు: గ్రమక్రమముగా, బెద్దల యను గృహమును మనకు దూరము చేయుచున్నది. గురువుల పై దిగఁబడ నింకొక్కరికిని బురికొలుపుట నింద్యము, స్వలాభనాశనకరము కలకాల మయస్క రము. భీకరలోకోపవాద సంపొదకము. కావున మన మక్కార్యమునల అవర్తింప రాదు. ఇప్పటి యీము కార్వము నింతకంటె నొక్కింతయు విస్తరించి వచింప రాదు అట్లు చేసిన మనల మనము నిందించు కొనినట్లగును. ఈ కొలది గంటల . మన ముత్యాచారము సలువున మనస్సుల "కెక్కినది. నా హృదయ భావము నోళ్ల నుండి వెడలకముంచే మెలకువపడ వలయును. మన తెలివి తేట లిపుడే కనబడును. మీరెల్లలు నాకంటే విశేషించి బుద్ధి ముతులరు. మీకుఁ దెలుపఁదగినంత యోగ్యత నాకు లేదని