పుట:సత్ప్రవర్తనము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

27

 మమ్ము నిరువుర నాయాటనుండి పొఱద్రోలిరి. ఆచింతతో దపించుచున్న వారము. మేమేమో" దాచిపెట్టి మాటలాడినట్లు నీ వూహించివి. ఇది మాదురద్రుష్టము కాదా యని వారు తమ యాశయముల వెల్లడించిరి.


ఆమాటలు చెవులబడిన తోడనే మండిపడుచు లేచి యేమీ! మీపేరు ఎన్నుకొన బడలేదా. చీ చీ: ఏమియాట! ఏమి పక్ష పాత్రను ? ఏల ఇట్లు జగినదో తెలిసికొన పలము. ఊర్కవిడువరాదు. నేడు గోరంతకు వచ్చినది. "రేపు కొండంతకు వచ్చును. ప్రతిక్రియ యూహింపక కున్న మించి పోవును. పిదప మనకందుఁ బ్రవేశమే పోవును. గుట్టిప్రయత్నము చేయవలయు. మీరూరకుండుడు.. నేను నిలువంబడి కార్యము నడుపుదును. మిత్రులందరని ప్రోత్సాహించి యక్కార్యమును నిర్వహించి యా సభ్యులు 'మొగములకు మసిపూయించెద. చూ ముచుండుడు, అని వారి మోముల చిహ్నము లెట్లుండునో యని గుఱితించి తనమాటలయందాదరము చూపిన జాడలాని యప్పుడే యచ్చటు వాసిపోయెను. వారు సీతఁడు ధనవంతుని కోడుకనియు పలువురు వంచకుల సూక్తి యుండు వాఁడనియు నమ్మి కార్య మెట్టులైన దమ కనుకూలముగా నెఱవేఱునని సమ్మిరి.


సూర్యనారాయణనవర్మయు నెందో యారాత్రి, శేషము గడపి మఱు దినమున పాఠశాలలోని విద్యార్థులను ఫలాహారము లిప్పించియు నిందుక ధనమిచ్చియుం దనకు ననుకూలురుగాఁ జేసికొని వారలతో నీయుదంతము తెల్పివారు తనయట్టి యభిప్రాయము గలవారు కాగా నపుడే వారందఱ నొక కట్టుగా నుండఁ జేసీ వ్యాయామ క్రీడా కల్పిత స్థలమునకుఁ.