పుట:సత్ప్రవర్తనము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

సత్ప్రవర్తనము.


నిరుపు రాదినమున నేన్ను కొనఁబడిన వారి పేరులలోఁ దగులక పోయింది. వారించుక త్వరపడు నలవాటుగలవారు. ఆవార్త సూర్యనారాయణ రాజు చెవులఁబడియెను, మంచి సమయము దొరకేనని సంతోషించి యారేయి యింటికిం బోవక "యేదో యుక కారణమున నిలిచితినని దలి దండ్రులకుఁ దెలియం జేసి తనవంటి వారిఁ గొందఱు బిబుచుకొని వారికడకేగి యేవో కొన్ని మాటలతో గాలము కొంత పుచ్చి ఫలహారములలో దెప్పించి వారును మిత్రులుఁ దానును భుజించి తాంబూలము నమలచు మూఁడవదినమున బందెపుటాటగదా, దానింజూగాడ మాబంధువులు వత్తుమని వ్రాసిన నొక్కి. ఫల్కి యందులకు వారుత్సాహమును జూగకయుండుటెఱింగి మీ పంతముల వాడుకదా చూడవలయునని యొక మాటను వదలి యద్దానికి బదులేమి వచ్చునో యని వేచియుండెను.

ఆయిరువురు మాఱుపలుకరైరి, సూర్యనారాయణరాజు పరిహాసముగాఁ గార్యము తఱి నెఱ మగంటిమిల జూపుదుము. కాని ముందు పలుక నేల యనియా మీరూరకున్న వారని నుడివెను, ఆయాటకు మాకును గాశికి “రామేశ్వరమునకు నున్నంత ధూరము కలదని విచారమును వెలిపుచ్చిరి. సందు దొరకెగదా యని యెంచి మీమాటల చ్చెరువుగా నున్నవి. "నేఁడు తెలుపకయున్న నానాడు తెలియక పోవునా? విదియనాడు కనఁబడని చంద్రుడు తదియనాఁడు తనకుదానే కనఁబడును గదా, చెప్పక మున్న మానే మిత్రులముకదా యని యడిగితీనని యేమో గొణుగుకొనుచు నూరకుండెను. 'వా రాతని మోముం గాంచి మిత్రమా! మాగ్రహచార మెల్ల యెడల న్యాపించినది, ఎవ్వరికని మా పైన గోపము కలుగుచున్నది .