పుట:సత్ప్రవర్తనము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

25


పడుచున్న చానూరక యుండరాదని తోచును. ఒక్కరికి గల్గినది 'మేలు కాదనియు, పిల్లలకు గలగినదే 'మేలనియం భావించు శక్తి కలుగును. అది కొంత కాలము ఎల్లరియందు సోదరత్వమును గల్గించును. ఈ గుణములు కట్టుబటిన యెడల నితర సద్గుణము లేన్నియో తమంతన యూవాలు నాశ్రయించును. వీని కన్నీటీకిని సత్ప్రవర్తనమును "పేరొక్కఁడు ప్రసిద్ధంబయ్యెనని యెరులుగవలయు. \

ఇట్టియూహలతో నేఱపటుచీన యావ్యాయామ క్రీడా సంఘమునందు సూర్య నారాయణరాజు కూడ నొక సభ్యుండుగా నంగీకరింప బడియెను, ధనవంతుని కొడుకనియు, నందుఁ జేరినయెడల దురభ్యాసములు పోవుననియు నూహించియే యందాతనిం జేర్చుకొనిరి. కొలదినెలలు గడచుదనుక నతండే వారికిఁ జిక్కులు కలిగించక తనపనిని దాఁజూచుకొనుచుండెను. రాను రాను దన పైనుపాధ్యాయులు సచ్చావముగల వారు కాక తన వస్పత్తిని మార్చుకొనవలయునని యెపుడు శాసింప నారం భించిరో, దానిచే తోడి బాలురు తనయందు మున్నున్న యాదరమును విడనాడిరో యది మొదలుకొని యందంతగికలహములు కలుగఁ జేయ నుంకించెను. ఏయుపొయముచే నది శక్యమాయని యాలోచించ సాగెను కొలఁది దినముల కొక యూహతోచి యది మదికి సరిపడినందున నద్దాని నాశ్రయించి యుపొధ్యాయులకు బాలురకుగల చక్కని సంబంధమును బాఱదోల బద్దకంకణుండయ్యెను.

ఒక్క నాఁడోక్క యాట 'వేఱొకజట్టుతో నాడవలసి నట్లు నిర్ణయింపఁబడియెను. విద్యార్థులలో నిందఱాడవలయు సనియు "నేర్పఱుపబడియే. ఆయాటకై యువ్విళ్ళూరుచున్న