పుట:సత్ప్రవర్తనము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

సత్ప్రవర్తనము.


దించుచు, వేళయెప్పుడగునాయని ఘటికాయంత మునే పలు సారులు చూచుచు నీలవేయుచు నెగురుచు దుముకుచునుండుట యాతని యలవాటులు, అంతీయ కాక పాఠశాల వదలంగానే దేహపరిశ్రమము చేయుచోటికి బోవక యందందుఁ దిరుగుచుఁ బొద్దుపోయిన పిదప నింటికిం బోవును. బీద బాలురు గొందఱు వాని తండ్రి, తమకు సొయపడుచున్నందున నెట్లో యాతని వెంటనుండి యింటికిఁ బిలుచుకొని పోవుచుండిరి.


ఉత్తమ కక్ష్యలలోనికిఁ జొచ్చిన పిదప దలిదండ్రులు మాటల గలలో నైన లెక్కింషక యిష్టమువచ్చినట్లు మెలంగ సాగెను. విద్యకన్న వ్యాయామ క్రీడలయందే యతనికి నభి రుచి హెచ్చఁజొచ్చెను. ప్రథమోపాధ్యాయుఁడు కూడఁ బలు సారులు హెచ్చరించెసు, కానియాతని గావిద్యయందు వాంఛా పరివృద్ధియే కలుగఁజోచ్చెను. పాఠశాలకుఁ బోవుటయు, పచ్చి నట్లు 'పుస్తకముసం జిహ్నము పడఁగనేఱొక తాపునకుం బోయి కాలముపుచ్చుటో లేక పడుకొని నిదురించుటో లేక యందందుఁ దిరుగుచుండుటో జరగుచుండెను. ధనవంతుని కుమాపుఁడని కొన్ని దినములు బుద్ది రాకపోవునా యని కొన్ని దినము లుపాధ్యాయులుదాసీనత వహించిరి. కాని పూట పూటకు సూర్యనారాయణ రాజు నవినీతి హెచ్చుచు నితరులం గూడ నాకర్షించు చుండుటంబట్టి పొరోపికల విడనాడిరి మధు సూదన రాజునకు నెఱింగించిరి. ఆతఁ డంతకుముందే కొడుకు దుడుకుతనములకు నేవగించుచునే యుండు వాఁడు. కావున వారితో మర్మముగా మాటలాడక బాహాటముగాఁ దన తనయుని యత్యాచారములందెలిపి భయ పెట్టుఁడని వారిని వేఁడు కొనియెను. మీరు చేయు దండనము తీక్షమైన నాతఁడు పాఱి