పుట:సత్ప్రవర్తనము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

సత్ప్రవర్తనము.


అని మహా భారతము బోధించుచున్నయది. అట్టి యుత్సాహబల మూఁతగాఁగా నావి ధ్యార్తియు యుపాధ్యాయులమన్ననలకు 'బాత్రుండై సుంతయు గౌవము లేక విద్యఁగఱచుచుండెను. ఆతనింగని మీరు ప్రవర్తనము బాగు చేసికొనుఁడని గురువులు విద్యార్థులకుఁ దెలుపుచుండిరి. ఒక్క దినమైన నా సీతారామరాజు వేళకు రాక యాలసించిన పాపమునఁ బోయినవాఁడువాడు. ఎప్పుడైన రెండు మూడు నిమేషము లాలస్యముగా నచ్చినచో నా ప్రథమోపాధ్యాయుఁడు ఘటి కాయంత్రమును సవరించును. పరికించిన దానియం దే లోపము కనఁబడుచుండును,


వేళకు వచ్చి యూరక కాలమును బుచ్చక పాఠములం జూచుకొనుటయు, నితరులు మాటలాడించిన నది యనవసర ప్రసంగమయ్యె నేని బదులిడక పుస్తకము నే చూచుచుండుటయుఁ, దన సాయమును గోరిన 'బాలురకుఁ దనకుఁ దెలిసిన 'పాఠముల సారమును దెలుపుటయు, నవ్వుచు నెల్లరతో మాటలాడుటయు, నసూయ నొందక యుండుటయు, సుసాధ్యాయులం గాంచినంతన లేచి 'వారి యనుమతిని గూరుచుండుటయుఁ, 'చారము సరిగాఁ దెలియకయున్న వినయము మీఱ నుపా ధ్యాయుల నడిగి, తెలిసికొనుటయు, వారు ముఖ్య భాగము లివి యని తెలిపిన వెంటనే వానికి గురుతులువైచి వేతొక చోట వ్రాసిని వానిని శ్రద్దగా మనస్సుస నిముడునట్లు చేసికొనుటయు, విశ్లేషించి యందఱితో మాటలాడకుండుటయు నాసీతారామరాజునకుం గల యల వాటులు. మఱియు నతఁడు దీనాంధక బధిరకుబ్జుంలుగాంచినపుడు కన్నీ కువదలిభగవంతుఁడు వీరిని గా పాడుఁగాకయని ప్రార్థించును. తసకుఁ బెద్దలిచ్చిన విత్త