పుట:సత్ప్రవర్తనము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

సత్ప్రవర్తనము.

నవ్వలికిఁ బొండని తిట్టికొట్టి తోసివైచిరి. మణికొందఱు వారిని ద్వరితముగ గెంటుఁడని పురికొలిపిరి, అంతియకాని యిట్టి మంచితరుణమున వారలకు సాయపడుఁడని ప్రోత్సహించువాఁ డొక్కఁడైన లేకుండెను.

పాఠశాలం బ్రవేశించినతోడ నే యెల్లరు 'బాలకుని తోడి బాలురలోఁ గూరుచుండఁ జేసి వాడుక చొప్పున 'నేదో యొక పొఠము బోధించినట్లు నటించిరి. ఒక యర్ధ ఘటికలో నెల్లరకు బుష్పఫలాదు లీయఁబడియెను. పన్నీరు చల్లఁబడియెను, ఎల్లరు బాలుని దీవించిరి, ఆనాఁటికి మధుసూదనరాజు నకు మర్యాద గనఁబఱచుటకుగాఁ బాఠశాల మూయఁ బడియెను. బాలురత్యుత్సాహమునఁ గేకలు వేయుచు నిండ్లకుఁ బోయిరి.


రెండవ ప్రకరణము.


సీతారామ రాజు పండ్రెండు వత్సరముల వయస్సు 'వచ్చునపు డుత్తమకక్ష్యలోఁ జదువుచుండెను. దానిపై కక్ష్యయే యా పాఠశాలయందు హెచ్చుది. దానీ పరీక్షలో గృతార్జుఁడైనచో విద్యావంతుఁడను పేరుఁ గాంచును. ఆ పేరు గలవారలలోఁ దాను బ్రథమగణ్యుఁడు కావలయునన్న యుత్సాహ కాబోలుని మనస్సున దినదినాభివృద్ధిని గాంచు చుండెను. ఉత్సాహమే మానవునకు బలము, ఉత్సాహమే