పుట:సత్ప్రవర్తనము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

17


ప్రయత్నించిన ఫాఆఫామునఁ బోలేదు. రాజు ముహూర్తమును గొంద అనుమానించుచున్న వారన “శస్త్రం కుజే రేభ్య సేత్ ” అని జ్యోతిర్విదాభకణమున నున్నదని యతఁడు బదులు 'చెప్పెను. అప్పుడోక యభ్యాగతుఁడందుండి యా పొత్తమున నాశ్లోకమే లేద నెను. అన్నంభట్టు కన్ను 'లెజ్జ చేసి జ్యోతీర్విదాభరణము మూడు భాగములు. మూడవ భాగ మచ్చుపడ లేదు. మాయింట నున్నది. ప్రతిదినము దానిలోని తాటీయాకు. నొకదానిని దంతధావన జాలమున నాలుక పై గల మలినము వాపుకొన నుపయోగించుచున్న నాఁడను. నా పొత్తము హస్తగతము, అందు లేదేని పది వేల రజిత 'ముద్రికల నిత్తును. నీవిత్తువా ? పందెము కట్టుము. తెచ్చి చూపెదను. అని గద్దించెను. ఆతఁడులికిపడి యీతని బారి నుండి తప్పించుకొన్న సదృష్ట వంతుఁడనే యనుకొని మౌనముద్రను దాల్చెను. రాజు క్షత్రియులకు మంగళవారము శుభప్రద మేమో యనుకొని యట్లే కానిండనెను.

రెండవ యామమున మొదటి విఘటికలో సుత్సవముతో బాఠకాలం బ్ర వేశింప వలయునని మౌహూర్తికుని యానతి. కాన సుత్సవవాద్యములతో గనకవల్లి నుండి, బయలు వెడలి కుముదవల్లిఁ జేరి మధుసూదన రాజు పుత్రుఁడు తన్మిత్ర బాలురు బంధువులు సేవకులు కూడ రాగా సకాలమునం బాఠశాలఁ బ్రవేశించెను, ఉపాధ్యాయులు వారెదు రేగి పిలుచు కొనివచ్చిరి. ఆప్రవేశ కాలమున ద్వారముకడ నిలుచుండిన దీనాంధకబధిక కుబ్జవికలాంగులు “బాబూ భిక్షమిండు, భిక్షు మిండు” అని వేడుకొనుచుండఁగాఁ బిలువని పేరంటమనునట్లు ధర్మాత్ములు కొందఱు తము నెవ్వరు నియమింపకున్నను వారి