పుట:సత్ప్రవర్తనము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

సత్ప్రవర్తనము.


మును వినవచ్చును. అతఁడు పడమరమోముగా నిలుచుండును. ఆ పీఠములయందు శ్రమము లేక నాల్గునందలపై డెబ్బది యెదుగురు కూరుచుండవచ్చును ఆ పీఠములకు నిరు పక్కల విద్యార్థులు వేరొక గదికిఁ గొని వెలుపలికి గాని పోవ మార్గము వదలఁబడియుండెను.


ఆయుత్సవము మంగళవారమున సాగెను. కొందఱు మంగళ వారము విద్యా భ్యాస మొనరింప మొదలు పెట్టఁ బనికి 'రాదనిరి. కానపర్తివారి పురోహితుఁ డన్నంభట్టు. ఆయన తండ్రి, గొప్ప పండితుడని పేరుగాంచెను. ఈయన్నంభట్టు కూడ నిరక్షర కుక్షి గాఁడు కాని తండ్రి పేరు చెప్పుకొని బ్రదుక దగినంత పొండిత్యమును సంపాదించెను. పొండిత్యము గలదో "లేదో దేవుఁడెఱుంగును. కాని "మొండి పట్టుదల యందఱకుఁ బ్రత్యక్షునుగుచుండెను. అతనితో వాదమునకుఁ బూనుట రేగు చెట్టుపై సంగవస్త్రము వేసి దాని నూడఁదీసికొనునట్టిది. "కావున నేవ్వరాతనితో విశ్లేషించి వాదింపక తొలఁగిపోపుదురు. "మొండిపట్టుదలయొకండుగాక దుర్వాసుని స్తరింపఁ జేయు కోపము కూడ నతనికిం గలధు. వాడి బలహీనుఁడైన నొకప్పుడు భగ్నదంతుఁడు కాక తప్పించుకొని 'పోంజాలఁడని యందఱను కొందురు. నలుగురిలో నున్నప్పుడుకాని యతనితో వాదింపరు. ఆముహూర్తము నెవరో మంచిది కాదని మధుసూదన రాజు నకుం దెల్పిరి. అతనికింగూడ నించుకజంకు లేక పోలేదు. అన్నం భట్టు తనకు శరణ్యుఁడని యూరక విడుచువాఁడు కాఁడు. ముంగోపము పుట్టుకతో వచ్చినదే కాని నడుమ రాలేదు. వెనుక నిట్లంటిఁగదాయని పరితపించుటయు నాతని యలవాటులలో నొక్కటి. కోపమునాపుకొనఁ బ్రయత్నించుట - యన్నంభట్టు