పుట:సత్ప్రవర్తనము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

15


వారాపరిమళము నాస్వాదించి సంతృప్తి నొందుదు కనుట నిర్వివాదము. ఆవృక్ష వర్ణములు లేతఁగా నున్నట్లే కసఁబడును. పండుటాకుల నెవ్వరును జూడఁ జూలదు. కింద బడునంత దనుక నవి లేతయాకులవలెనే యుండును. వానియందొక జిగురుండును. అది లేకుండుటయే వానికి జరము దశాయని యూహింపవలయును.


వాని నడుమునున్న మార్గము కన్నుల పండువు చేయఁ జాలును. మధ్యాహ్నమున గ్రీష్మ కాలము నాదారిని నడుచు వారు దాని వదలఁ జాలరు. కడుదూరముగా నీది వ్యాపించి యుండిన యెంత బాగుండునో యని యూహించువారు నేకులు గలదు. ఆతోవన నూటు బాహువులు పోవ నాగ దీప భవనము కనఁబడును. దానిని జూచినంతనే యపూర్వసంతోషము పొడసూసి యందుఁబఠించిన నెంతయో మేలుగలదనియే తోచును. దానిముందొక భాగము పొఠశాలనంటి ముందునకు సాగియుండును. దాని స్థంభము లిష్టకలచే నిండఁ బడినవి. ఎఱగా నవి యుండును. ఆది శకటములు నీలుచు తావు, శకటములపై ఁ జనువా రందు దిగి లోపలికిఁ బ్రోవవలయును. లోనికిం బోపంగనే విశాల సభాస్థల మొక్కటి చక్కఁగంగనం బడును అందుఁ గూరుచుండి యుపన్యాసములను వినుదురు, అది తూర్పు పడమరలకు సాగియుండు. దానికి 'రెండు ప్రక్కల 'బాలురకుఁ 'చాఠములు చెప్పు గదులుండుసు ఒక్కొక్క భాగమున నాఱేసి యవీ కలవు. అందుండి వచ్చు వా రాసభాస్థలమునఁ దమ గదులకడ నుండు మార్గమున వెలికిఁ బోవలయును. సభాస్థలముషం బీఠము లమర్పఁబడియే యుండును, అందుఁ గూరుచుండి వేదిక పై నిలుచుండి చెప్పుచుండునుపన్యాస