పుట:సత్ప్రవర్తనము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

సత్ప్రవర్తనము.


యన్న నూక్తి ప్రథితమేకదా. అట్టులా దివాణములు రెండును నాశ్రీతుల మూలమున విశ్లేషించి పొగడ్తఁగాంచెను.

సూర్యనారాయణరాజు కుముదవల్లి పాఠశాలకుఁ బంపఁ బడియెను. ప్రథమ ప్రవేశము గానఁ దొలుత బాథశాలాధి కారికిం దెలిపి యలంక రింపవలయునని ప్రార్థించి పలయు పరీథరములం బంపి మధుసూదన రాజు తన భాగ్యమునకుఁ దగినట్లుత్సవము చేయింపఁ బూనెను. ఉపాధ్యాయులందఱు ధన వంతుని కొడుకు చదువవచ్చుచున్న వాడనియుఁ దమకపు డపుడు బహుమతులు దొరకుచుండుననియుఁ దలంచి యా యుత్సవమునఁ బాల్గొనిరి. పాఠశాల బహిఎథ్వారము పచ్చని తోరణములచే గై నేయఁబడియెను. ఇరువంకల నరంటికంబ ములునుకులబడియెను, పండ్ల బరువున నని వంగియుండెను. అది మొదలు పాఠశాలవజకు వాళ్లు మార్గ మేర్పఱపబడి యుండెను. దానికి రెండు పక్కల మంచి చెట్లు పెంచఁబడి యుండెను. అవి మిక్కిలి చల్లగా నుండుటే శాక పూల తావుల వెదఁజల్లుచుండెను. పండ్రెండు నెలలు నాపూవులు కొఱఁత లేక యుండును, ఆవృక్షము లమెరికాయను దేశమున దక్షిణ భాగమునఁ గల (బ్రె జిల్) దేశమునుండి తెప్పింపఁబడినవని యెల్లరసుకొనుదురు, భరతఖండ వాసు లవ్యానంగాని పోని బోలిన వృక్షములఁ గాని చూచియే యెఱుంగరు. శీతల ద్రుమ ములనవచ్చును. పుష్పవృక్షము లనవచ్చును. ఆవూవులు నాకుల వలెనే యుండును. కాని వాని పరిమళము విచిత్రము. ముక్కు రంధముల నానందింపఁ జేయుటయే వానిషని. చూడ శృంగా రముగా నుండకయాకుసుమములు ధరింపవలయం నను కోరికను బుట్టింపక యుండును. చెంతనున్న వారికంటె దూరముననున్న