పుట:సత్ప్రవర్తనము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము

18


"రాజునకు నీ బాలునకు వయస్సున నించుక భేదము. కొన్ని నెల లితండు చిన్న వాడు. ఒక్క వీదియందే నీ గృహములు "రెండుసు గలవు. రాజగృహములను సాధారణముగా దివాణ మని ప్రజలు పిలుతురు. ఈ రెండుగృహములు దివాణము అనియే పిలువబడుచుండెను. కాకరపర్తివారి యిల్లు. పెద్ద దివాణమనియు, నరపతివాల్లు చిన్న దివాణమనియు వాడుక గాంచెను. ఆశ్రితులు ఆ రెండు నివాములను నమ్ముకొని యెవరి యింటికి బోయినపుడు వారిని బొగడుచు జీవించుచుండిరి. ఈ స్తుతులు హరిహృదయమునం గల ప్రీతిని దెలుపునవి యనియే వారు తలంచిననుట తగద్దతి గాదు, ముఖ స్తుతులకు 'బేలుపోవని వారు లేరనకాదు గాని సామాన్యముగా, లేరన వచ్చును, మోల నుతించువాడు పరోక్షమున దూషించునని నమవచ్చును. మోల దోషముల నేకాంతమునఁ జెలుపువాఁడు పరోకమున వినుతించు ననవచ్చును. ఈ రెండు నియమము లకు సాధారణముగా లోపము రాదు. లోమున వంచకులు ముఖస్తుతులు చేయుదురు. తన పని కాగా లెక్కింపక యిచ్చ వచ్చినట్లు తూలనాడుదురు. శ్రేయస్సు కాండించువాఁడే మిత్రు డనంబడును, ఆతఁ డోంటరిపాటున నీయం దీదోషము లున్నవి. వాని నెట్టెనఁ దొలఁగించుకొనుమని హితోపదేశము "చేయు. ఆతఁడు మన మేలుకాంక్షించిన వాఁడు, మసము లేని తావున మన దోషములఁ గప్పిపుచ్చి యణువులుగా నున్న సుగుణములఁ గొండంతలు చేసి పొగడును,

.• . .. .. .. మిత్ర సమాఖ్యరత్న ముంజ్ . ..
శ్రీకరవర్ణ యుగ ను సృజిం చినయన్న తప్పు : డెన్వండో "