పుట:సత్ప్రవర్తనము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

సత్ప్రవర్తనము.

________________


మనోవ్యాకులము . తనవలనఁ దండ్రికిం గలుగఁగూడదని యాతనియాశయము, వేళకు గొడుకు రాకయుండిన పల్లి యుమలించుచుఁ దల వాకిళిల్లుగా భావించి దారిఁ జూచు చుండును. "లేక లేక కలిగిన సంతానముపట్ల జననీజనకుల కట్టి భావముండుట లోక సామాన్య ధర్త మేకాని కొత్త కాదు.

ఆ బాలుఁడు పాఠశాలకు బోవుచు వచ్చుచుండునపుడా యూరనున్న నారీమణులు చూడ నోచిరేని యేదోయొక మిషచే మాటలాడించి కొని పోనీయరు. నాయనా! చదువుకొను చున్నా "వాయని యడుగువారు కొందఱు, అమ్మ బాగున్నదా.. నాయనగారికి గుశలమాయని ప్రశ్నించువారు కొందరు, ఏక్ష్యలో జదువుచున్నాఁడవు బాబూ అనియడుగువారింకొకరును గొందలు నిట్టే యేదో యడుగుచు నించు కాలము పుచ్చి యాతనిం గాంచి సంతసించి యిఁకఁబోయిరా బాబూ అని సాగు సంపువారు, ఇట్లు చూచినవారెల్ల నాసుశీలుని బ్రీతి పరస్పముగా మాటలాడించుచుండిరి. ఆకాంతామణులం గన్నెత్తి యెనం జూడక తల వంచుకోనియే బదులుపలుకు వాఁడు. ఇట్లు నానాటి కావిద్యార్థి యెల్లరమన్ననకుఁ బాత్రుడయ్యెను.

కనకవల్లియందే నివసించు 'వేరొక రాజకుటుంబము కాకరపర్తి యను 'గృహనామమునఁ బ్రసిద్ధమై యుండెను. సరపతి కుటుంబమునకన్న నీకుటుంబము భాగ్య సంపన్నము. మర్యాదగలదనియే ప్రతీతి. కాకరపర్తి కుటుంబమున కధికారి మధుసూదనరాజు. ఆయన ధర్మపత్ని యిందిరాంబ. వారికొక పుత్రుండు కలిగెను. సూర్యనారాయణవర్మ, యని నామకరణ మొనర్చి యాతనిం 'బెంచుచు మహానందము నొందుచు నా దంపతు లదృష్టవంతులమే యనుకొనుచుండిరి. సీతా రామ