పుట:సత్ప్రవర్తనము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.



మహానది యనఁగా జలములమూలమున మానవులకు మహోపకార "మొనర్చునది యనియే మనము విశ్వసింప వలయును. స్నానపానములకు సుస్వములకు నది యుపయో గించును. స్నానమారోగ్యము నిచ్చును. జలపానము పుష్టిని మేథాశక్తి నొసంగును. ఇంతకంటె గావలసిన దేమి? నదీ స్నానమునఁ బాపములు తొలగునని పెద్దలందురు, ఆరోగ్యము గలిగి మేథాశక్తి వృద్ధినొందిన మంచియూహలు గలుగును. ఆ యూహలు మంచి యలవాటులు గలుగఁ జేయును. మంచి నడవడి కలిగిసం బాపకార్యములు చేయఁడు, ఇక నాతఁడే పుణ్యాతుఁ డనఁబడును. ఇన్ని యుపకారములు చేసిన నది పూజింపఁదగిన దనుటయుక్తము కాదా!

నదుల సాయము ప్రధానముగా గల్గియున్న భూమి. నదీమాతృక యనంబడును. బాలునకుఁ దల్లివలె నది యా భూమీకి బయోదానము చేయును. శిశువునలె దాన నదీ వృద్ధి నొందును. నదుల సమీపముననున్న దేశము ధనసంపన్నమగు. వ్యాసారము సాగును, సమృద్ధిగా ధాన్యముండును. మాసవు లాఁకటఁ గృశింపక యున్న నాయుస్సు నశింపదు. వయస్సు త్వరగా సడలదు. వార్ధకము చిన్న తనముననేరాదు. విశేషించి బుద్ది వృద్ధియై సూక్ష్మ విషయములను గ్రహింపఁజూలును. దాన విద్యాభివృద్ధి గలుగును. అద్దాని మూలమున విఖ్యాతి యెల్ల కడల వ్యాపించును. ఇన్నింటికి మూలము నదియే కదా! కావున నదులపలని యుపకారము లసంఖ్యాకములు, వానీ నెల్ల వర్ణింప నిది చోటుగాదు .

గోదావరి యొడ్డున ననేక పురములు, గ్రామములు, పల్లియలు గలవు. ఆందోక యగ్రహారము మనోహరముగ