పుట:సత్ప్రవర్తనము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్త సము



గౌతమీనది బొంబాయి రాజధానిం గల త్వంబక క్షేత్రమున బుట్టినది, ఆ క్షేత్రము నాసిక యనంబడు ప్రసిద్ధ పురమునకు రెండు యోజనముల దూరమున పడమర భాగమున నున్నది. త్ర్యంబకము శివ క్షేత్రమని యా వేరే చెప్పక చెప్పుచున్నది. ఆ గ్రామమునకుఁ బడమర దెశ దాసం గోశమాత్ర దూరమున నొక పర్వతము గలదు. అది దక్షిణము నుండి ఉత్తరమునకు సాగియుండును. దక్షిణపు దిక్కున నించుక తూర్పునకు సాగియుండును. దానికి బెక్కండ్రు, యాత్రా పరులు ప్రదక్షిణము చేయుదురు. ఒక్క యోజనము మాత్రము దాని చుట్టుకొలత కలదు, దాని పొడ నించుమించుగా రెండు గోశములుండు ననవచ్చును. తూర్పు నుండి పడమరకు సాగి యుత్తరమునకుఁ బెరిగిన యాచోట ననంగా నైఋతి మూల యందు గౌతమి పుట్టును, అందొకచోట నందివక్త్ర ముండును. దాని నోటినుండి బిందు రూపమున నీ నదీజలముప డుచుండును, అదియే దాని పుట్టుక వందురు. సగరము నడుమ గుశస్థలి యను నొక సరస్సు గలదు. గౌతమముని యందు నదిని బార్లించెనందురు. అందుండి నది సాగినట్లగపడదు. దీన్ని కాలువ నిర్జలముగాఁ గవబడును, నాలుగు కోశముల దూరమున ఇవవిదిక్కునందుఁ ఒక తీర్థము కలదు. గౌతమముని చక్రముచే భూమిని "భేదింపఁగా నది కనఁబడి ప్రవహింతునని చెప్పి నట్లు పలుకుదురు, అటునుండి స్వల్ప ప్రవాహముగా నదీ ప్రవహించును. ఆంధ్ర దేశమును బ్రవేశించు నప్పటి కిది య నే కోపనదుల మూలమున వృద్ధినొంది మహానదియగు. దీని మహత్త్వ మపారమందురు, పురాణముటయందు దీని మహత్వము విశేషముగఁ జెప్పఁబడినది.