పుట:సకలనీతికథానిధానము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

79


తే.

కానుపింపదె శుక్లపక్షంబు పదియు
దివసములదాక నిచట కేతేరవలవ
దనుచు ఘనసారయుతమృదుహస్తములను
[1]సౌంజ్ఞ చేసిన యదిగాని చెరపుగాదు.

93


వ.

అనిన నూఱడిల్లి యప్పదిదినంబులు గడపి పదునకొండవనాఁ డెప్పటియు నా విశ్వస్త నొడంబరచి చెప్పుమని పంపిన నది యట్లచేసిన.

94


క.

అమ్మగువ కుంకు మలదుచు
నమ్ముదుసలియురమునందు నంకితములుగా
ముమ్మడిరేఖలు నిలుపుచు
బొమ్మన్నను వచ్చి నృపతిపుత్రున కనియెన్.

95


తే.

ఎన్ని మాటలు చెప్పిన నియ్యకొనదు
మారుమాటాడ దింకనే మతమొకాని
కుంకుమాంకిత మృదుకరాంగుళుల నురము
వ్రేసెనని చూప భూపతి వివశుఁడైన.

96


వ.

బుద్ధిశరీరుం డిట్లనియె యిట్లేల పరవశుండవైతివి తా రజస్వలను దివసత్రయానంతరంబునం జనుదెమ్మని పట్టించుమనిన నర్ధాంగీకారంబున నుండె నంత.

97


తే.

దివసములు మూడు నరిగిన తెరవగరపె
యనుపుటయు బోయి యెఱిఁగింప నంగనకును
పొత్తిచీ రిచ్చి యిఁకరాకు పొలఁతి యనుచు
మాడు నెక్కించి త్రాట నమ్మగువ డించ.

98


వ.

అరుగుదెంచి అవ్విధంబు జెప్పిరండని యరిగిన మంత్రిసూనుండు రాజకుమారునిం జూపి నీకు నాగమనమార్గంబు నిర్దేసించెననియె నంత.

99
  1. చేసినది సన్న యది గాని చెఱపు గాదు