పుట:సకలనీతికథానిధానము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

సకల నీతిథానిధానము



ఉ.

వేంకటనాథపుణ్యపదవీ గతయోగసనాథ విస్ఫుర
త్పంకజనేత్ర భైరమహపాత్రమనోంబుజ మిత్రశంక చ
క్రాంకిత బాహు[1]పద్మనిగమాంత మనోహరపద్మకౌస్తుభా
లంకృతపీనవక్ష కమలాముఖ లగ్నకటాక్షవీక్షణా!

360


క.

కుటిలసుర విమత మదహృ
త్పుటచటుల విఘటనచక్ర భూషణ బాహా
కటితటఘట నాహాటక
పటరాజిత కుంటముక్ల భైరవు వరదా!

361


వనమయూరము:

శ్రీమహితరూప! పదసేవితసురేంద్రా!
క్షేమకర! తల్పగత! శేషగత శోభా!
భామహిత గంగవిభు భైరవసుధి హృ
ద్ధామ! తిరువేంకటనిధాన! జగదీశా!

362


గద్య.

ఇది యష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసురత్రాణ కూచనామాత్యపుత్ర సుకవిమిత్ర వినయవిద్యావిధేయ యెఱ్ఱయనామధేయప్రణీతంబైన సకల నీతికథా నిధానంబునం బ్రథమాశ్వాసము.

363
  1. పాణి