పుట:సకలనీతికథానిధానము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

సకలనీతికథానిధానము


లూరులు దిరుగుచో నొక్కుచో నురుల
        గానొడ్డిన బడి యాయురులు ద్రెంచి
కారుణ్యమున దమ్ము గాఁచిన ద్విజుని
        రక్కసుండు భక్షము చేయుకట్ట యనుచు[1].

194


వ.

తమదుఃఖంబు జెప్పు పలుకులు విని విక్రమార్కుఁ డవ్విప్రుం జంపు రక్కసుకడకుం జని యెదురనిలిచి యే తదగ్రహారబాడబునివరుసకై వచ్చితి భక్షింపు మనిన మెచ్చి యతం డిట్లనియె.

195


క.

వర మడుగు మనిన ద్వాదశ
వరభూసురవరుల భుక్తి వలదని యడుగన్
వరదు డయి గాచె విప్రుల
నరపతియును నరిగె నాత్మనగరంబునకున్.

196


వ.

ఇంక నొక్కటి వచించెదనని యప్పరమభాగవతుం డిట్లనియె.

197


క.

మగతనము గలుగు పురుషుఁడు
మగువలుఁ గుయ్యిడిన నరసి మాన్పగవలదా
జగతి నొకవిప్రసతికై
తెగిచంపడె దనుజుశౌర్యు దినకరుఁ డాజిన్?

198


వ.

అదియెట్లనిన.

199


సీ.

ఉజ్జయినీపురి నూరుజుఁ డొక్కఁడు
        మణిభద్రుఁడనెడు నామంబువాఁడు
నిర్ధనుండై పడి నిలువంగ నేరక
        పరదేశములవెంటఁ దిరిగి తిరిగి
మధురాపురీబహిర్మాలూరవనమున
        దైత్యు చేబడి యొక్కతరుణి కూయ
వినివచ్చి విక్రమారునకు జెప్పిన విని
        వానితోగూడ నవ్వనము జొచ్చి

  1. 194వ పద్యము సరిగా లేదు. ఉన్నది యున్నట్లుగానే ప్రకటించితిమి.