పుట:సకలనీతికథానిధానము.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

సకలనీతికథానిధానము


సీ.

అని చెప్పి నిజారాక్షసాకృతి నెడఁబాసి
        యరిగె శాపవిముక్తుఁ డగుచు నసుర
బ్రాహ్మణుండును తసభాగినేయుండగు
        శక్తిదేవునకు నాజాడ చెప్ప
ధరణీసురుం డబ్ధితటమునకును జని
        తాళేశ్వరునకు పుత్రత్వ మొంది
జలధిపై వేటకుఁ జని వానితోఁ గూడ
        ప్రవహణం బబ్ధిలో భగ్నమైన


విధివశంబున నొకవటవృక్ష మబ్ధి
జలముపైఁ దోఁప నత్తరుశాఖ వట్టి
వార్ధి మునుగకయుండ, నవ్వటముశాఖ
నున్నగృధ్రంబు పలికె నయ్యుర్విసురుని.

303


జలధరవృత్తము.

వెఱవకయుండుము విప్ర యటంచున్
గఱచుక యేఁగుచు ఖచరుండతన్ (?)
పఱచుచు నొప్పదిఁపంబున డించ్చన్[1]
గిఱికొని యందుల కిన్నరకాంతల్.

304


గీ.

విప్రుఁబొడ గాంచి యచటికి వేఁగ వచ్చి
రందు చంద్రప్రభయనెడి యతివయోర్తు
హస్తిమల్లోపమగు (?) మదహస్తి నెక్కి
వచ్చె నింద్రాణియునుఁ బోలె నచ్చటికిని.

305


వ.

అంత.


క.

సాంద్రతరస్మితనిర్జిత
చంద్రప్రభ కుచవిలిప్త చంద్రప్రభ నా
చంద్రప్రభఁ గనుగొని ద్విజు
చంద్రుఁడు స్మరరాహుగిళితచంద్రుం డయ్యెన్.

306
  1. వఱచచు నాద్వీపముననుడించన్