పుట:సకలనీతికథానిధానము.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

సకలనీతికథానిధానము


నృపతి తనరాజ్య మిచ్చి నన్ను పచరింప
వసుధ యేలుచు నీసింహవర్మునకును
దగుసహాయత కేతెంచి ధరణినాథ
నిన్నుఁ బొడగంటి ననినను నృపవరుండు.

260


వ.

దైవబలంబునకును సంతసించినవాఁడై, మంత్రగుప్తునిం జూచి నన్నుఁ బాసి నీ వెచ్చట నేమి చేసితనిన నతం డిట్లనియె.

261


గీ.

దామలిప్త(ముగలపురిఁ)పురంబునఁ[1]
బువ్వుఁదోట కేను బోయి యచట
కందుకోత్సవమునఁ గడు నొప్పు నృపపుత్రి
కందుకావ తనెడుకన్నె గంటి.

262


క.

అక్కన్యక యవ్వని నే
నక్కాంతను దూతిఁ జేసి యనిపిన నది దా
నక్కన్య యగ్రజాతున
కక్కథ యెఱిఁగింప నన్ను నంబుధి వైచెన్.

263


తరల:

కలము వట్టుక యేను దైవముకతనఁ బ్రాణము గల్గి య
క్కలము చేరి హితుండనై రిపుగర్వముల్ విదళించి య
క్కలన నెప్పటి వార్ధిలోఁ బడి గట్టుచేరి తటాంతర
స్థలము కాననవీధి రాక్షసతన్విఁ జూచి భయంపడన్.

264


వ.

అద్దానవి యిట్లనియె.

265


క.

ఈలాగున నేటికి నీ
వేలా వనవీథి దిరుగ విప్రుఁడ! యనినన్
నాళీకవదనపై నా
మేలూలినకతన ననిన, మెలఁతుక పలికెన్.

266
  1. “దామలిప్తమనెడు నామముగలపురిఁ” అనుట యుచితిము.