పుట:సకలనీతికథానిధానము.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

సకలనీతికథానిధానము


తే.

గజము చంపక దైవయోగమునఁ బాద
బంధనము ద్రెంచి మావంతు పట్టుకొలుప
నంత మావంతు తల గొట్టి హస్తిఁ బరపి
వీడు మట్టించె నాబాలవృద్ధముగను.

164


వ.

అంత.

165


క.

అపహారవర్మయను పూ
ర్వపుమిత్రుఁడు వచ్చి చండవర్మను, వెస నే
నపగతజీవునిఁ జేసితి
నృప! నిను సంకెళ్ళ నిడిననీచాత్మకునిన్.

166


వ.

అని యివ్విధంబునఁ దొల్లి రాజవాహనుతోఁగూడ దిగ్విజయార్థంబు వెళ్ళివచ్చిన కుమారనవకంబును నటుక్రితంబు వ్యవహారతీర్థయాత్రాభ్రాంతులై పోయిన మువ్వురును రాజ్యంబులు వడసినవారలు గావున చండవర్మకు సహాయు లౌట రాజవాహనుపైఁ గవిసి తెలిసి యప్పన్నిద్దఱు నతనిం బట్టబద్ధునిం జేసి సేవింపుచు నొక్కనాఁడు.

167


క.

అపహారవర్మ యిట్లను
నృపనందను రాజవాహునిం గనుంగొని యో
తపనప్రతాప! యవ్విం
ధ్యపుగిరి మము డించి నీవు దలఁగిన పిదపన్.

168


ఉ.

భూవర! మిమ్ము నే వెదుకఁబోవుచు జైనులపల్లె గాంచుచో
గ్రేవల నేడ్చుచున్న యొక కేవలిఁ[1] గాంచి యదేల యేడ్చెదో
పావనమూర్తి! యన్న ననుఁ బల్కెఁ గనుంగొని యేమి చెప్పుదున్
గావరమెత్తి నాఁకు గలకర్బుర[2]మెల్లను వేశ్య కిచ్చితిన్.

169
  1. కేవలి = సన్యాసి
  2. కర్బురము = బంగారము