పుట:సకలనీతికథానిధానము.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

185

తృతీయాశ్వాసము


సీ.

ఒకపరదారకు నువిద యొక్కతె దూత
        చర్య వర్తింప నజ్జారమగఁడు
తనకాంతఁ బట్టి మ్రాకునకు బంధించిన
        నిశియందు గుంటెన నెలఁత వచ్చి
యుపపతి వచ్చినాఁ డువిద రమ్మని పిల్వ
        కట్టినాఁ డెటువలెఁ గదలి వత్తు
ననిన నీకట్లును ననుగట్టి యందాక
        బోయిరమ్మ నట్ల పోవ నతఁడు


తే.

కట్ల నున్నది యాత్మీయకాంత యనుచు
మఱియు నెగ్గులు వలుక నత్తెరవమూల
దట్టమగు చీకటిని దాని దగులబట్టి
కోపమున ముక్కు మొదలంటఁ గోసి విడిచె.

321


ఆ.

అంత నక్కాంత యది దీర్చి యరుగుదెంచి
కట్లు దాసికి విడిచి త న్గట్టినట్ల
యుండె సత్తైనసతి నైతినేని దెగిన[1]
ముక్కు గ్రమ్మర నాకును మొలుచుగాత.

322


వ.

అనిన వాఁడు దీపికాహస్తుండై నాసిక గనుంగొని పరమపతివ్రతవు తప్పులో గొనుమని దండంబు వెట్టి కలసియుండి రంత నక్కడ.

323


క.

హితవరియై నిజనాసా
చ్యుతు బొందినుగండు గోసె శుద్ధాత్మ ననుం
గత మేమి లేకయని భూ
పతికిన్ మొరపెట్ట జంప బంపెన్ దానిన్.

324


వ.

అంత.

325
  1. యుండి సత్సతినైతినే నొర దెగిన