పుట:సకలనీతికథానిధానము.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

179


క.

మానవుఁ డుపాయబలమునఁ
బ్రాణము రక్షించి సకలభాగ్యము గాంచున్
గాన నుపాయుజ్ఞుండే
మానవవరుఁ డనిరి బుద్ధిమంతులు జగతిన్[1].

281


వ.

అది యెట్లనిన.

282


సీ.

ద్వైతాటవిని సముద్ధతుఁడను సింహంబు
        మృగములనెల్లను మెసవుచుండ
మృగములు హరిఁ బల్కె దగునె మమ్మిందఱి
        భక్షింప నిలువర్స భక్షణంబు
సేయుము నీవన్న సింహంబు వది యియ్య
        కొని వర్సతో భుక్తిఁ గొనుచునుండ
నిఱ్ఱికి నొక్కనాఁ డిలువర్స వచ్చిన
        మృగమృగీపోతంబు లేడ్చుచున్న


తే.

శశము పొడగని సింహంబు జంపి వత్తు
ననుచు నూరడఁ బల్కి తా నరిగి హరినిఁ
గాంచుటయు వేళ దప్పె నాఁకలియుఁ బెరిగె
నేల నిలిచితి వనిన కుందేలు వలికె.

283


క.

కేసరిమ యొక్కటి మముఁ
గాసిం బెట్టంగ వానికథ దీర్పగ సే
నోసరివి చెప్పవచ్చితిఁ
దోసము గలదనిన హరియు దుర్మదవృత్తిన్.

284


ఉ.

కోపితచిత్తుఁడై యెచటఁ గుత్సితజంతువు నుండునన్న నే
జూపెద రమ్మటంచు మృగశూరునిఁ దోకొనియేఁగి వాఁడు నీ
కూపములోన నుండునన గూలము ద్రొక్కటు చూడ నాత్మస
ద్రూపవునీడ దోఁచుటయు రోషముతో నురికె న్విమూఢుడై.

285
  1. "మానవవరు డనిరి బుద్ధిమానసజనముల్” అని గ్రంథపాఠము