పుట:సకలనీతికథానిధానము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

సకలనీతికథానిధానము


క.

కాశిపురిలోన బ్రాణ
క్లేశము బొందింపవలదు కేదారజల
ప్రాశనము జేయవలవదు
శ్రీశైలము జూచినపుడె చేకురు ముక్తుల్.

58


క.

తలయేరువట్టి శ్రీగిరి
తలయంపిగబడిన జనవితానంబులకున్
తలయేరు వాయ దెప్పుడు
తలలేరినపేరు నొడల దడబడుచుండున్.

59


తే.

అట్టి శ్రీగిరి చేరువన చల మొకటి
యాద్యమై యుండు చంద్రగుప్తాఖ్య మగుచు
నట్టిగిరి యేలు చంద్రవంశాబ్ధిభవుఁడు
చంద్రగుప్తుండునా నొక్కజనవరుండు.

60


మాలిని.

ఆనరనాయకు మోహపు బుత్రి సితాంబుజలోచనచంద్రికనా
మానిని మాన సుగంధిసమంచిత మత్తకరిప్రతియాన కళా
సూనవిలాసిని చంపకనాస వినూత్నవిభూషణ నిత్యము ను
ద్యానవనంబునకుం జని మల్లెలదండల నర్చన సేయు శివున్.

61


క.

ఈగతి నాబాలామణి
శ్రీగిరిపై శివుని బూజసేయగ నంతన్
నాగవిభూషణుఁ డయ్యెల
నాగకుఁ బ్రత్యక్షమయ్యె నగజాయుతుఁడై.

62


వ.

అక్కామిని కోరిన యట్ల మల్లెవిరులం బూజించుటం జేశి మల్లికయను నబిధానంబు నొసగి యాత్మనామంబు [1]మల్లికార్చనుండనియును ధరియించి తన్ను దర్శించినవారికి భోగమోక్షంబులు గృపసేయుచుండె.

63
  1. మల్లికార్జునుండని?