పుట:సకలనీతికథానిధానము.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

173


వ.

ఉపదేశించిన నదియ చేయుచుండు నంత నొక్కనాఁడు.

246


క.

పరదేశి విప్రుఁ డొక్కఁడు
సురుచిరతరవిభవరూపశోభితుఁ డగుచున్
బురవీధి దిరుగ జారిణి
పురుషుం డిలు వెళ్ళి నదికి బోయినవేళన్.

247


క.

పరదేశి విప్రు నిజమం
దిరమునకుం దెచ్చి దొంటితెరఁగున కడుభీ
కరమైన రూపు గైకొని
యరుదెంచిన భయము బొంది యత డిలు వెడలెన్.

248


వ.

అట్లిల్లు వెడలి బమ్మరించుచు నెదురుపడిన యవ్విఫ్రునకుఁ జెప్పిన నందఱికిం జెప్పకున్న ప్రమాదం బనిన నచ్ల చెప్పిన నెవ్వరు నాపైఁదలి జూడ భయపడుచుండి రంత.

249


ఆ.

క్షిప్రకోపుఁ డాత్మగృహమున కేతెంచి
భార్య కనియె నాకు భైరవుండు
చెప్పె నన్యపురుషుఁ జేపట్టినది యని
యన్న నీదువేల్పు నడిగిచూడు.

250


వ.

అనియెం గావున.

251


క.

దైవముకంటెను మానుష
మీవిధమున నెక్కుడయ్యె నిదిగో విప్రుం
డావెలఁది మానుషంబున
దైవీ(?)కపు జారతనము దగిలినకతనన్[1].

252


వ.

అనిన లంబోష్ఠుండను పిశాచంబు మానుషంబుకంటె దైవికం బెక్కుడని యొక్కకథ చెప్పందొణంగె.

253
  1. దైవికదోషంబునుండి దగిలినకతనన్