పుట:సకలనీతికథానిధానము.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

సకలనీతికథానిధానము


ఖండనము చేయుమనిన నక్కపియు నట్ల
యుండి భూపతి నిద్రింప నొక్కయీఁగ
ముట్టుటయు ఖడ్గమున దాని బెట్టుగొనిన
గళము దెగుటయుఁ బ్రాణసంగతికిఁ బాసె.

375


వ.

అట్లు గావున.

376


క.

అవివేకి చెలిమికంటెను
వివేకి యెడవైర మొప్పు విపినంబున భూ
దివిజుని గాచెనుఁ జోరుఁడు
ప్లవగముచే నృపతి చచ్చె భవనమునందున్.

377


వ.

అట్లు గావున నవివేకియైన మేఖలతోఁడిపొందు చారాయణునికి[1] వలదని చెప్పుకొని రంత.

378


ఆ.

భాగురాయణుండు పనిచెం గళావతి
కపటవర్తనంపుగతులు చెప్పి
యదియు నామృగాంక కవ్విధం బెఱిఁగించి
లలితమణులచే నలంకరించి.

379


సీ.

అల్లనఁ దోకొని యరిగి భూపతి నిద్ర
        చెందినయవ్వేదియందు నిల్పి
నీమణిహారంబు నృపతికంఠమ్మునఁ
        బెట్టు మాతఁడు నిన్నుఁ బట్టెనేని
రత్నసుందరికి వెఱతువు నీవని, బోలు
        గంభంబుఁ జొచ్చి చీఁకటిని నిలువు
మనుచు బోధించియు నామృగాంకను బాసి
        చని కళావతి యొక్కచక్కి నున్న

  1. చారాయణుఁడే చాగణరాయఁడు.