పుట:సకలనీతికథానిధానము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

111


గుంజరాశన[1]తరుకుంజాంతరంబున
        రమియింప నొకబ్రహ్మరాక్షసుండు
జనపతి కనియె బ్రాహ్మణపుత్రుఁ దలిదండ్రు
        లలమిపట్టఁగ నాకు బలియొనర్పు


ఆ.

మిట్లు సేయకున్న నిప్పుడె భక్షింతు
నిన్ను ననిన వేగ నృపతి యపుడు[2]
కనకపురుషునొకనిఁ గల్పన సేయించి
విప్రనందనునకు వినిమయముగ.

278


వ.

ఇచ్చి తదీయజననీజనకులచేత శిరఃపదంబులు వట్టించి ఖడ్గం బెత్తి వేయ డగ్గరిన నవ్విప్రకుమారుండు నవ్వె నేమిటికిం జెప్పుమనిన విక్రమార్కుం డిట్టులనియె.

279


ఆ.

తల్లిదండ్రు లలర ధరణీశుచేఁ దెగ
వేతఁబడగఁ జేసె విప్రు నన్ను
బళిరె విధి యటంచుఁ బకపక నవ్వె వా
డనినఁ బ్లక్షమునకు నరిగె నసుర.

280


వ.

ఎప్పటియట్ల పట్టితెచ్చునెడ నొకకథ వినుమని యిట్లనియె.

281


ఆ.

వసుధ నొక్కపురము వైశ్యుండు తనకూఁతు
పిన్నవయసునందె పెండ్లి సేయ
యావనమున జారయై విప్రుఁ గలయంగఁ
తొంటినాథుఁ డరుగుదెంచి యపుడు.

282
  1. కుంజరాశన = రావిచెట్టు
  2. "నిన్ను ననిన నృపతి శీఘ్రమునను" అని గ్రంథపాఠము యతిభంగముగా కన్పించుచున్నది.