Jump to content

పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాంప్రదాయిక విజ్ఞానం

ఇప్పటి నాగరిక జాతులన్నీ కూడా ఒకప్పుడు బహు అనాగరికంగా ఉండేవి. ఆ అనాగరిక స్థితిలో అవి కొంతజ్ఞానం సంపాదించాయి. ఆజ్ఞానం ఒకతరంవారినుంచి మరొక తరంవారు నేర్చుకొంటూవచ్చినందు వల్ల అది ఇప్పటికీ నిలచిఉంది. ఈ జ్ఞానానికే అటుతర్వాతి వారుకూడా కొంతకొంత చేరుస్తూవచ్చారు. మొత్తంమీద ఈ జ్ఞానానికి సాంప్ర చాయిక విజ్ఞానం (Folk Lore) అని పేరు.

సంఘంయొక్క శైశవస్థితిలో ఆర్జించిన ఈ జ్ఞానంలో సవ్య మైన కార్యకారణసంబంధం ఉండదు, ఒక్క వాఙ్మయాంశం తప్ప విడిచి. ప్రకృతిశాస్త్రాదుల విషయమై వారికి కల జ్ఞానం బహుస్వల్పం. అంతేకాకుండా ఆఉన్న కాస్తజ్ఞానమైనా ప్రకృత్యతీత కారణాలతో నిండి ఉంటుంది.

ఈ సాంప్రదాయిక విజ్ఞానం నాగరిక జాతులలో ఇంకాకూడా నిలచిఉంది. దానికి కారణం జాతీఅంతా నాగరికం కాకుండా కొంత భాగంమాత్రమే నాగరికమవడం, తక్కిన అనాగరిక భాగంకూడా క్రమేపీ నాగరికమవడంతోటే ఈ విజ్ఞానం సంఘంలో మచ్చుకేనా లేకుండా పోతుంది.

సంఘంయొక్క శైశవస్థితిలో పుట్టిన, ఈజ్ఞానాన్ని ఇంచుమించుగా అజ్ఞానమనే చెప్పవచ్చు. అటువంటి అజ్ఞానం క్రమేపీ నశించి పోతూన్నందుకు మనము విచారించాలా అంటే - నిజంగా మనం ఏమాత్రమూ విచారించనవసరంలేదు. సంఘం క్రమేపీ నాగరిక మవుతూన్నందుకు మనమంతా సంతోషించవలసిందే, కాని నాగరిక

  • గ్రంథకర్త రచించిన 'సాంప్రదాయిక విజ్ఞాన' మను నీవ్యాసము

1988 డిసెంబరు 'భారతి'లో ప్రకటించబడింది.