పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41




10
తాతగారియింట్లో తా నాడబోయె
తాతతో తాఆడు వేంకటరమణ
శ్రీమద్దికాయల్లు శ్రీల లాటాలు
చిలుకల్లు యేమ నెనో చిన్నబోయేను
హంసల్లు యేమనెనో చిన్న బోయేను
హంసలతో వనమందు ఆడ నేవద్దు.

11
పుక్కిళ్ళు సన్నాలు భుజకీర్తులు
చెక్కిళ్ళు సన్నాలు చెవుల గున్నాలు
కాళ్ళును సన్నాలు గజ్జలకడియాలు
వేళ్ళును సన్నాలు ముద్దుటుంగ్రాలు.

12
శ్రీరంగం వెళ్లేటి చిన్నవైష్ణవులు
అదిగో చూడరయ్య గాలిగోవురము
గుళ్లోను చూడరే రంగనాయకులస్వామి.

13
లాలెమ్మ రత్నాలు కీలెమ్మ జడలు
కీలెమోక్షపుసరులు వెంకటేశకురులు
మెడనిండ ముత్యాలు మేలు పతకాలు
తలనిండపుట్టు వెంట్రుకలు తనరారురా(రే?)క.
అష్టరావిరేక నొసలు మెరియంగ,.

14
జోలలకు చినపండు నీ కరటిపండు
నినుగన్న వారికి పాలపండేను
పాలపండూ తిన్నపాలరుగ వన్ని
వామైన నూరి పొయ్యి ఓ గౌరీదేవి