Jump to content

పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40




ఇచ్చినదేవునిబోలు ఈశ్వరునిబోలు
బ్రహ్మదేవునిబోలు బాలల్లబోలు.

5
పెదమామ తెచ్చిండు పెంచపులిదండ
నడిపిమామ తెచ్చిండు నాగభూషణాలు
చినమామ తెచ్చిండు చిలకల్ల తొట్టె
అవి మావెంకటరమణకు అమరుకడియాలు.

6
మందలకు పోవయ్య మామ తరిణయ్య
మరువక తేవయ్య మచ్చావుపాలు
అవి తెచ్చిమారాజు వెంకటరమణకు పోసె

7
వెన్న పెట్టి నే కొందు వెండిపుస్తకము
వెన్నుడు పెద్దన్న వేదమ్ముచదువు
పాలు పెట్టి నేకొందు పై డిపుస్తకము
బాలుడు నడిపన్న భారతము చదువు
గరుజుయిచ్చి నే కొందు గంటల్లబండి
గానుడు చిన్నన్న గంట కట్టేడు.

8
నిద్రవికన్నుల్లు మబ్బు మొగముల్లు
నిద్రపో బలభద్ర రాజకొమార
నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు
నిన్ను గన్నతండ్రికి నిండ నూరేళ్లు.

9
తాత ముత్తవ్వల తలిదండ్రులబోలు
తలిదండ్రి గారాబాన ఆడువెంకటరనుణ.