ఈ గ్రంథంలో ఇంకో ప్రత్యేకత, చివర టిప్పణము చేర్చి ప్రస్తుతము వాడుక లో లేని చాలా ప్రయోగాలకి అర్థము సాధించారు. ఇలా చేయ టము చాలా అవసరము. ఇటువంటి పుస్తకములను అలాగు ప్రచురించి ననే ఎక్కువ ఉపయోగము. కాలప్రవాహంలో అడుగున బడిపోతూన్న ఆమూల్య సారస్వతాన్ని అతి శ్రద్ధతోను, ఓపికతోను ఏమాత్రము ప్రతి ఫలా పేక లేకుండా పొందుపరుస్తున్నందుకు ఆంధ్రులు కామేశ్వరరావు గారికి కృతజ్ఞులు. ఇలాంటి సారస్వతము ప్రచురించటానికి. ఈగ్రంధ క ర్తయే ప్రథములని తోస్తుంది 1929 లో ఈలాంటి పాటలను "భారతి" లో వీరు సాహసించి ప్రకటించారు. దానితర్వాతే పత్రికల్లో యితరులు కూడ ప్రచురిస్తూ వచ్చేరు: ఇందులో మొదటి ఖండము మాత్రము 1930 లో నే పుస్తుకాకారం లో వెలువడింది. ఆ ప్రతులు (మచ్చుకైన లేకపోవటంచేతను యింకా క్రొత్తవాటిని గ్రంథకర్త సేకరించటంతో ను శ్రీ కామేశ్వరరావు గారు ఈ గ్రంథాన్ని ఆంధ్రదేశానికి అందజేస్తు న్నారు. ఇలాంటి గ్రంధాలు ఇంకా వెలువడటము కామేశ్వరరావు గారి కృషికి సరియైన సత్కారము.
ఏలూరు,
- 18-5--41
రాయప్రోలు సుబ్రహ్మణ్యము