పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32


63.
గిద్దె పెసరాపప్పు గిన్నెతో నే వండి
వద్దు వద్దనగానె వడ్డించి వెళుదు .
పొద్దుటన్నములోకి పొలములో వెళ్ళి
.................................

64.
చిన్నారి పొన్నారి చిన్న కోవెలవు
చిగురుమామిడి కింద చిన్న కోవెలవు.
..................................

65
చిమడకే చిమడకే ఓ చింతకాయ
నువ్వెంత చిమిడినా నీపుల్ల పోదు
ఉడకకే ఉడకకే ఓ వుల్లి పాయ
నువ్వెంత వుడికినా నీకంపు పోదు.

66.
వదినగారలు మీరు వాసి గలవారు
వండబోయినచోట కుండ నాకేరు.
బావగారలు మీరు భ క్తి గలవారు
నిండివున్న సభలోను పిండిబుక్కేరు.
....................................

67.
ఆకలికి వేళాయె అమ్మ తలుపాయె
అమ్మగారింటికే పోను బుద్ధాయె.

68.
పనంటె నావొళ్లు భారకిస్తుంది.
భోజనమంటే నావొళ్లు పొంగిపోతుంది.